Tuesday, October 21, 2025 07:27 PM
Tuesday, October 21, 2025 07:27 PM
roots

రోడ్డు మీద విగ్రహం.. స్వామి చుట్టూ రాజకీయం..!

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమలలో అపచారం.. అంటూ ఏదో ఒక విషయంపై భూమన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే హంగామా చేశారు కూడా. గోశాలలో ఆవులు మృతి చెందుతున్నాయని.. భక్తులకు సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని.. నెయ్యి కల్తీ జరగలేదని ప్రమాణం చేస్తానంటూ.. ఏదో ఒక అంశంపై వివాదం చేస్తూనే ఉన్నారు.

Also Read : టీటీడీలో వైసీపీ కోవర్టులు.. భూమన అరెస్టు ఖాయమా..?

తాజాగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పట్ల అపచారం జరిగిందని మరో వీడియో రిలీజ్ చేశారు భూమన. స్వామి విగ్రహాన్ని రోడ్డు పక్కన పడేశారని.. దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విగ్రహం వద్దకు చేరుకుని పూజలు చేశారు కూడా. అయితే ఈ అంశంపై టీటీడీ వివరణ ఇచ్చింది. అక్కడ ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహం కాదని.. అది శనీశ్వరుడి విగ్రహం అని అధికారులు తెలిపారు. అలాగే ఆ విగ్రహంలో లోపం ఉందని.. అందుకే శిల్పి దానిని అక్కడే వదిలేశారని వెల్లడించారు.

బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు ఇచ్చిన ఆర్డర్ మేరకు శిల్పం చెక్కుతున్న సమయంలో లోపం రావడంతో.. విగ్రహాన్ని అక్కడే వదిలేసినట్లు స్తపతి కుమారుడు గురు స్వామి మీడియాకు వివరించారు. ఆ విగ్రహం ఇప్పుడు పెట్టింది కాదని.. దాదాపు పదేళ్లుగా అక్కడే ఉందని కూడా తెలిపారు. దీంతో టీడీపీ, జనసేన నేతలు భూమన తీరును తప్పుబడుతున్నారు. ఐదేళ్లుగా ఆ విగ్రహం అక్కడే ఉన్నా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Also Read : తిరుమల.. వారి పట్ల మరింత కఠినంగా..!

టీడీపీ నేతలు ఆరోపణలకు స్పందించిన భూమన.. ధీటుగా జవాబిచ్చారు. వైఖానస ఆగమ శాస్త్రం తెలియని వాళ్ళు తనపై అసత్యాలు మాట్లాడుతున్నారని.. అలిపిరి వద్ద ఘోరమైన అపచారం జరుగుతోందని చెబితే తప్పుడు కేసు పెడతామని హెచ్చరిస్తున్నారన్నారు. “అది శనీశ్వర విగ్రహం అని చెప్తున్నారు. శంకు చక్రాలు ధరించిన విగ్రహం ఎలా శనీశ్వర విగ్రహము అవుతుంది? శని విగ్రహానికి విల్లు, బాణం ఉంటుందా? అది శిల్పి చెక్కి నిరక్ష్యంగా పడేశారని సమాధానం చెప్తున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నా.. అది శ్రీమహావిష్ణువు విగ్రహమే నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది.” అంటూ వ్యాఖ్యానించారు. “నాపై తప్పుడు కేసు పెట్టి, జైల్లో వేసినా చెప్తూనే ఉంటా నేను నాయకుడ్ని కాదు.. స్వచ్ఛమైన హిందువును, హిందూ ధర్మం పట్ల పూర్తి నమ్మకం ఉన్నవాడిని, నాపై ఎన్ని సార్లు దుష్ప్రచారం చేసినా ఎవ్వరూ నమ్మరు, స్వామి అనుగ్రహించారు కాబట్టే రెండు సార్లు టీటీడీ చైర్మన్ గా, మూడు సార్లు బోర్డు సభ్యునిగా అవకాశం ఇచ్చారు. ఏడాదిన్నర కాలంగా మీరు ఏమి చేస్తున్నారు, ఇది ముమ్మాటికి ఆ మహావిష్ణువు విగ్రహమే.. నాపై ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడేది లేదు.. రాజకీయాల కంటే హిందూ ధర్మ పరిరక్షణే నాకు ముఖ్యం.” అని భూమన సవాల్ చేశారు.

భూమన వ్యాఖ్యలకు టీడీపీ నేతలతో పాటు బోర్డు సభ్యులు కూడా ధీటుగానే బదులిస్తున్నరాు. స్వచ్ఛమైన హిందువు, హిందూ ధర్మం పట్ల పూర్తి నమ్మకం ఉంటే.. కుమార్తె వివాహం ఎందుకు ఇతర మతాచారం ప్రకారం చేశారని ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. రెండుసార్లు వేంకటేశ్వర స్వామి దయ వల్ల బోర్డు ఛైర్మన్ పదవి రాలేదని.. వైఎస్ కుటుంబానికి ఊడిగం చేస్తే వచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి కూడా ఈ విషయంపై ఘాటుగానే జవాబిచ్చారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీసేలా భూమన కుట్రలు చేస్తున్నారని.. వీటిపై చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్