Sunday, October 19, 2025 12:46 PM
Sunday, October 19, 2025 12:46 PM
roots

భోజనం టైంలో పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా..?

ఈ రోజుల్లో చిన్న పిల్లలు ఫోన్ లేకుండా గంట కూడా గడపడం లేదు. దీనిపై తల్లి తండ్రులకు నిపుణులు ఎన్ని విధాలుగా హెచ్చరికలు చేసినా సరే మార్పు రావడం లేదు. తినడం లేదని, తాగడం లేదని ఏదోక కారణంతో ఫోన్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. కానీ ఇది అత్యంత ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. పిల్లల్లో గుండె ప్రమాదాలకు ఎక్కువగా ఫోన్ చూడటం కారణం అంటున్నారు నిపుణులు. ఒక్కో గంట పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని, గుండె సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

Also Read : పొగాకు తాగుతున్నారా..? అయితే డేంజర్ న్యూస్ మీకోసమే..!

ఎక్కువగా స్క్రీన్ చూడటం వాళ్ళ కార్డియోమెటబోలిక్ ప్రమాదం పెరుగుతుందని, ముఖ్యంగా నిద్ర సరిపోనప్పుడు ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని కొత్త అధ్యయనంలో పరిశోధకులు వెల్లడించారు. స్కూల్స్, కాలేజీల్లో ఫోన్ లు, ట్యాబ్ లు వాడటం అధికమైందని, అది పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని పరిశోధకులు హెచ్చరించారు. స్క్రీన్ టైం గంట పెరగడం కారణంగా తీవ్ర ప్రభావాలు ఉంటాయని, దీని కారణంగా నిద్రపోయే సమయంపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

Also Read : క్వాంటం వ్యాలీ ముహూర్తం ఖరారు..!

ఇతర గుండె సమస్యలు కూడా తీవ్రమవుతున్నాయని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో 2020 నుండి ఆన్‌ లైన్ క్లాసులు, స్మార్ట్‌ ఫోన్ వాడకం పెరుగుదల కారణంగా పిల్లల్లో నిద్ర కరువైందని హెచ్చరించారు. ఆహారపు అలవాట్లు మారడమే కాకుండా, బాల్య దశలోనే ఊబకాయం రావడం, ఇన్సులిన్ నిరోధకత వంటి కార్డియోమెటబోలిక్ సమస్యలు పెరుగుతున్నాయని సంచలన విషయాలు తెలిపారు. నిద్రపోవడానికి గంట ముందు స్క్రీన్ దూరంగా ఉంచితే మెలటోనిన్ హార్మోన్ సరిగా పని చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. భోజన సమయాల్లో ఫోన్ అలవాటు చేయడం కారణంగా తీవ్రమైన ప్రభావాలు ఉంటాయట. ఇక శారీరక శ్రమను అలవాటు చేయాలని, దీని వల్ల కూర్చునే సమయం తగ్గడమే కాకుండా, గుండె పనితీరు మెరుగుపడుతుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్