Sunday, March 22, 2026 10:22 AM
Sunday, March 22, 2026 10:22 AM

సజ్జల అవుట్.. సతీష్ రెడ్డి ఇన్.. జగన్ కీలక ఆదేశాలు 

ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయి ఇబ్బందులు పడుతోన్న వైసీపీ, ఇప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డి చర్యల కారణంగా మరిన్ని సమస్యలు ఎదుర్కొంటోంది అంటూ వార్తలు చూస్తున్నాం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన, ప్రభుత్వాన్ని నడిపారు అనే విమర్శలు వచ్చాయి. పదే పదే మీడియా సమావేశాల్లో సజ్జల కనపడటం కూడా వైసీపీ నాయకత్వంలో ఆగ్రహం వ్యక్తం అయింది. కార్యకర్తలు సైతం సోషల్ మీడియాలో ఆయన చర్యలను తీవ్రంగా తప్పుబట్టడం కూడా చూసాం.

Also Read : యూరియా వాడితే క్యాన్సర్.. చంద్రబాబు సంచలన కామెంట్స్

ఇక ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పూర్తిగా సజ్జలను పక్కన పెట్టినట్టు వైసీపీ అనుకూల మీడియాలో సైతం కథనాలు వస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీలో సజ్జలతో సన్నిహితంగా ఉండే నాయకులకు జగన్ పవర్స్ కట్ చేసినట్టు సమాచారం. వాళ్ళకు సాక్షి మీడియా కూడా దూరంగా ఉండాలని, జిల్లా నాయకత్వం వారి ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని కూడా వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. ఇక వైసీపీ అనుకూల మీడియాకు కూడా కీలక ఆదేశాలు వెళ్ళాయి.

Also Read : భారత్ కు ట్రంప్.. అమెరికా రాయబారి కీలక ప్రకటన

సజ్జల తీరును ఎండగడుతూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రసారాలు ఉండాలని కేంద్ర కార్యాలయం ఆదేశించినట్టు తెలుస్తోంది. అనుకూలంగా ఉండే యూట్యూబ్ చానల్స్ కు సైతం సజ్జలకు సంబంధించి వ్యతిరేకత కథనాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. సజ్జల స్థానంలో పులివెందులకు చెందిన సతీష్ రెడ్డికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కూడా పార్టీ కార్యాలయం నుంచి సంకేతాలు వెళ్ళాయి. పార్టీ కేంద్ర కార్యాలయం బాధ్యతలను కూడా సతీష్ రెడ్డికి అప్పగించే అవకాశం ఉంది. సాక్షిలో కూడా సజ్జల అనుకూల కథనాలు గాని, మీడియా ప్రసారాలు గాని వద్దని చెప్పినట్టు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీలో ఆయన ఆదేశాలు ఎవరైనా పాటిస్తే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరించినట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్