Saturday, October 25, 2025 07:45 PM
Saturday, October 25, 2025 07:45 PM
roots

డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ లీక్.. గిల్ తండ్రిపై ఆరోపణలు

భారత క్రికెట్ లో డ్రెస్సింగ్ రూమ్ లో జరుగుతున్న వ్యవహారాలు లీక్ అవుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా డ్రస్సింగ్ రూమ్ లో జరిగిన వ్యవహారాలు మీడియాకు లీక్ చేశారని కొంతమంది ఆటగాళ్లపై ఆరోపణలు వచ్చాయి. యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ డ్రెస్సింగ్ రూమ్ లో జరుగుతున్న వ్యవహారాలను మీడియా ప్రతినిధులకు చెప్పినట్లు ఆరోపణలు వినిపించాయి. అందుకే అతనిని ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయలేదని కూడా కామెంట్స్ వచ్చాయి.

Also Read : విజయసాయి రెడ్డి సంగతేంటి..? అప్రూవర్ గా మారారా..?

ఇక ఇప్పుడు టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్.. తండ్రి పై ఆరోపణలు వస్తున్నాయి. డ్రెస్సింగ్ రూమ్ లో జరిగే కొన్ని వ్యవహారాలను తెలుసుకుంటున్న గిల్ తండ్రి వాటిని మీడియాకు లీక్ చేస్తున్నారట. ముఖ్యంగా ఓపెనర్ జైశ్వాల్, సీనియర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ పై నెగిటివ్ ప్రచారానికి సమాచారాన్ని ఇస్తున్నాడని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. దీనిపై బీసీసీఐ పెద్దలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సాధారణంగా ఆటగాళ్ల కుటుంబ సభ్యులు డ్రెస్సింగ్ రూమ్ వరకు వెళ్లడాన్ని తప్పుపడుతూ ఉంటారు. కొన్ని కారణాలతో వారి కుటుంబ సభ్యులను దూరంగా ఉంచుతారు.

Also Read : ఆలోచన మానుకోండి.. లేదంటే..!

గిల్ కెప్టెన్ అయిన తర్వాత అతని తండ్రి డ్రెస్సింగ్ రూమ్ కు ఎక్కువగా రావడం అక్కడ ఉన్న ఆటగాళ్లతో ఎక్కువగా మాట్లాడటం వంటివి చేస్తున్నాడని బీసీసీఐకి సమాచారం అందినట్లు జాతీయ మీడియా సైతం పేర్కొంది. దీని వెనక కారణాలేంటి అనేది తెలియకపోయినా ఆసియా కప్ కు గిల్ ఎంపిక కావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర సీనియర్ ఆటగాళ్లు ఎవరు ఆసియా కప్ లో ఎంపిక కాలేదు. బూమ్రా, గిల్ మాత్రమే ఎంపిక అయ్యారు. అతనికి వైస్ కెప్టెన్ గా బాధ్యతలు కూడా అప్పగించారు. దీని వెనక ఏదో జరిగి ఉండవచ్చని మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. జైశ్వాల్ టి20 ప్లేయర్ కూడా. అలాంటిది అతనిని ఎంపిక చేయకపోవడం అనేక అనుమానాలకు దారితీసింది. అయితే గిల్ తండ్రి మీడియా ప్రతినిధులకు ఇచ్చిన సమాచారం ఏంటి అనేదానిపై బీసీసీఐ ఆరా తీస్తున్నట్లు కూడా సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్