దేశ వ్యాప్తంగా టోల్ వసూలు చేసే విషయంలో కాంట్రాక్ట్ సంస్థలు ముక్కు పిండి వసూలు చేస్తాయి. రోడ్ల నిర్మాణం సరిగా లేకపోయినా, గుంతలు పడినా సరే ఏ మాత్రం జాలీ దయా లేకుండా వసూలు చేస్తూ ఉంటారు. దీనిపై తాజాగా సుప్రీం కోర్ట్ సంచలన ఆదేశాలు ఇచ్చింది. గుంతలు పడిన రోడ్లపై టోల్ వసూలు చేయకూడదు అని స్పష్టం చేసింది. వాహనదారులపై టోల్ బాదుడుపై ఎన్హెచ్ఏఐపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. గుంతలు పడి, ట్రాఫిక్ జామ్ అయిన రోడ్లపై టోల్ వసూలు చేయకూడదని తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్ట్.
Also Read : రాహుల్, సిరాజ్ ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు..? బీసిసిఐ సీరియస్..!
గుంతలు పడిన, ఏ మాత్రం డ్రైవింగ్ చేయడానికి అనువుగా లేని, ట్రాఫిక్ జామ్ అయిన రహదారులపై వాహనాదారులను టోల్ చెల్లించేందుకు బలవంతం చేయవద్దని స్పష్టం చేసింది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో పలియక్కర ప్లాజా వద్ద టోల్ వసూలును నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం సమర్ధిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటీషన్ ను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం కొట్టేసింది.
Also Read : అంతా మా వల్లే.. క్రెడిక్ కోసం పాకులాట..!
నిలిపివేసిన టోల్ వసూలు వల్ల కలిగే ఆర్థిక నష్టం కంటే పౌరుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇచ్చామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కేరళలోని ఇటీవల త్రిసూర్ జిల్లా ఎడప్పల్లి – మన్నుత్తి జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనాల ప్రయాణానికి 12 గంటలకు పైగా సమయం తీసుకుంది. దీనిపై స్థానిక మీడియా సంచలన కథనాలు ప్రసారం చేసింది. ఆ వీడియో లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిని సీరియస్ గా తీసుకున్న కేరళ హైకోర్ట్.. టోల్ ఫీజు నాలుగు వారాల పాటు కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. టోల్ కట్టినప్పుడు మంచి రోడ్లు ప్రయాణికులు కోరుకోవడంలో తప్పు లేదని కోర్ట్ స్పష్టం చేసింది.




