ఆన్లైన్ గేమింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై కేంద్ర సర్కార్ కీలక అడుగు వేసింది. బుధవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభలో ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు, 2025ను ఆమోదించారు. ఈ బిల్లు ఇ-స్పోర్ట్స్, క్యాజువల్ గేమింగ్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టారు. అయితే వ్యసనం, ఆర్థిక నష్టాలు, భద్రతా ముప్పు కారణంగా రియల్-మనీ గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం.
Also Read : కూన ఎపిసోడ్‌లో కులం రచ్చ..!
బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో ఈ బిల్లు చర్చ లేకుండానే ఆమోదించారు. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశ పెట్టిన ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు, 2025కు ఆమోద ముద్ర వేసారు. ఆన్లైన్ గేమింగ్ కు మద్దతు ఇచ్చినా, ప్రమోట్ చేసినా, ఆడినా సరే 3 ఏళ్ళ జైలు శిక్ష లేదంటే కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
Also Read : రష్యా సంచలన ప్రకటన.. భారత్ ఆయిల్ కొనడం ఆగదు..!
ప్రకటనల విషయంలో కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంది. అలాగే బ్యాంకులు గాని ఇతర ఆర్ధిక సంస్థలు గాని ఆయా యాప్స్ కు నిధులను ట్రాన్స్ఫర్ చేయడం నిషేధం. ఇలాంటి అనేక ప్లాట్ ఫారమ్ లను మనీలాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాద సంస్థల కమ్యూనికేషన్ కు మార్గాలుగా ఉపయోగించుకుంటున్నారు అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయంతో ఈ యాప్స్ పై ప్రభావం పడుతుంది. డ్రీమ్ 11, మొబైల్ ప్రీమియర్ లీగ్, మై 11సర్కిల్, హౌజాట్, ఎస్జీ 11 ఫాంటసీ, విన్జో, గేమ్స్24×7 జంగ్లీ గేమ్స్ (రమ్మీ & పోకర్), పోకర్‌బాజీ, గేమ్స్‌క్రాఫ్ట్ (రమ్మీకల్చర్), నజారా టెక్నాలజీస్ వంటి యాప్స్ పై ఈ బిల్లు ప్రభావం చూపిస్తుంది.