Tuesday, October 21, 2025 09:09 PM
Tuesday, October 21, 2025 09:09 PM
roots

రాహుల్ అరెస్ట్.. ఢిల్లీలో అలజడి వాతావరణం

ఓటర్ లిస్టు అవకతవకలపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. నేడు ఢిల్లీలో ఇండియా కూటమి పెద్ద ఎత్తున నిరసన తెలిపింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగగా.. ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ అధికార బిజెపితో కుమ్మక్కయ్యిందని నిరసనకు దిగారు రాహుల్. గత మూడు, నాలుగు రోజుల నుంచి రాహుల్ ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read : రోజాకు మ్యూజిక్ స్టార్ట్.. పక్కా ప్రూఫ్స్ తో దొరికారా..?

ఈ నిరసనలో రాహుల్ గాంధీతో పాటుగా, ప్రియాంక గాంధీ వాద్రా , శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ సహా సీనియర్ ప్రతిపక్ష ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శివసేన (యుబిటి) నేత ప్రియాంక చతుర్వేది కూడా ఉన్నారు. రాజ్యాంగాన్ని, ఓటు హక్కును కాపాడటం కోసం తాము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నామని, వాస్తవం ఏంటంటే.. దీనిపై బిజెపి ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉందని రాహుల్ మండిపడ్డారు.

Also Read : కృష్ణా నదికి వరద ఫుల్.. బెజవాడకు వర్షం నిల్..!

అరెస్ట్ చేసిన ఇండియా కూటమి నాయకులను సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఎన్నికల సంఘం మార్చ్ సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్లమెంటు భవనం నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఎన్నికల కమిషన్ కార్యాలయానికి నిరసన ప్రదర్శన చేసింది. వాస్తవానికి 30 మందితో మాత్రమే నిరసన తెలపాలని పోలీసులు అనుమతి ఇచ్చారని కాని 200 మంది వచ్చారని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. గత ఏడాది మహారాష్ట్ర ఎన్నికల నుండి కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్