Friday, September 12, 2025 07:04 PM
Friday, September 12, 2025 07:04 PM
roots

పాకిస్తాన్ ను ఓ ఆట ఆడేసాం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం ఓ రేంజ్ లో నెలకొంది. ఆ తర్వాత భారత ఆపరేషన్ సిందూర్ కు శ్రీకారం చుట్టింది. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. అయితే ఆ తర్వాత అమెరికా జోక్యంతో రెండు దేశాల మధ్య వాతావరణం కాస్త శాంతించింది అనే చెప్పాలి. ఇక తాజాగా భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తాము చేసిన కార్యాకలాపలపై సంచలన విషయాలను వెల్లడించింది.

Also Read : అమిత్ షా, జేపీ నడ్డా ఫోన్ లు కూడా..?

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ వైమానిక స్థావరాలను కూల్చివేసినట్లు అధికారికంగా భారత నేవీ అధికారులు ప్రకటించారు. భారత వైమానిక దళ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్ శనివారం మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత సాయుధ దళాలు కనీసం ఐదు పాకిస్తాన్ యుద్ధ విమానాలను, ఒక పెద్ద విమానాన్ని ధ్వంసం చేశాయని వెల్లడించారు. హాల్ మేనేజ్‌మెంట్ అకాడమీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థకు భారత్ తీవ్ర స్థాయిలో నష్టం కలిగించింది అన్నారు.

Also Read : వార్ 2 పై కూలీ డామినేషన్ లెక్కలు ఇవే.. ఈ రేంజ్ లోనా..?

భారత్ ఐదుగురు సైనికులను కోల్పోయిందని, పాకిస్తాన్ భూభాగంలో దాదాపు 300 కిలోమీటర్ల వరకు వెళ్లి దాడి చేసామని వెల్లడించారు. పాకిస్తాన్ లోని లాహోర్, కరాచీలో ఉండే కొన్ని వ్యవస్థలను నాశనం చేసామని ఆయన తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లను కూడా నాశనం చేసామని పేర్కొన్నారు. కొన్ని ఎఫ్ 16 విమానాలను నాశనం చేసామని ఆయన వెల్లడించారు. ఆరు రాడార్లను కూడా నాశనం చేసినట్టు వివరించారు. ఆపరేషన్ సిందూర్ ఇప్పటికీ కొనసాగుతుందని, ఇది తాత్కాలిక విరామమే అన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్