తెలంగాణా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో కీలక అరెస్ట్ లు ఉంటాయనే ప్రచారం నేపధ్యంలో.. కీలక పరిణామం చోటు చేసుకుంది. జాతీయ స్థాయి అంశంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మారిపోయింది. ఈ విషయాన్ని అత్యంత సీరియస్ గా తీసుకున్న బీజేపీ అధిష్టానం సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తోంది. పార్లమెంట్ సమావేశాల ద్రుష్ట్యా రేపటి బండి సంజయ్ విచారణ వాయిదా వేసింది సిట్. ఈనెల 28న హాజరవుతున్నట్లు సిట్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాసారు.
అదేరోజు సంజయ్ తోపాటు సిట్ విచారణకు సంజయ్ వ్యక్తిగత సిబ్బంది కూడా హాజరు అవుతారట. కేంద్ర నిఘావర్గాల ద్వారా కీలక సమాచారం, ఆధారాలు సేకరించిన బండి సంజయ్.. సిట్ ఎదుట కేంద్ర మంత్రి పలు ఆధారాలను సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్ చేయడంపట్ల బీజేపీ సీరియస్ గా తీసుకుంది. భార్యభర్తల బెడ్రూం మాటలను ట్యాప్ చేయడాన్ని సీరియస్ గా పరిగణిస్తున్న బీజేపీ అధిష్టానం… సిబిఐకి అప్పగించాల్సిందే అని డిమాండ్ చేస్తోంది.
Also Read : మహిళ దెబ్బకు షాక్ అయిన సుప్రీం ఛీఫ్ జస్టిస్
ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో బీజేపీ లీగల్ సెల్ కేసు కూడా ఫైల్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ పాత్రపై ఆధారాలను ఐబీ వర్గాలు సేకరిస్తున్నాయి. ఇప్పటికే పెద్దాయన(కేసీఆర్) చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ ఎదుట రాధాకిషన్ రావు అంగీకరించారు. డీజీపీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు వెల్లడించారు. దీనితో కేసీఆర్, కేటీఆర్ ల చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ విషయంలో ఈనెల 28న బండి సంజయ్ సిట్ ఎదుట ఏం చెప్పబోతున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది.