రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఏమో గాని వైసీపీ నేతల్లో భయం మొదలైంది. ఇప్పటి వరకు ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్న నాయకులు ఇప్పుడు ఆజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. తాజాగా మాజీ మంత్రి పెర్ని నానీ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. రప్పా రప్పా అనడం కాదు చీకట్లో కన్ను కొట్టాలంటూ పామర్రులో వైసీపీ క్యాడర్ కు సలహాలు సూచనలు ఇచ్చిన నానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అర్ధం కావడం లేదు. ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసారు.
Also Read : పొన్నవోలును మార్చినా పని జరగలేదా..? అందుకే మరో రెడ్డి గారికి..!
అక్కడి నుంచి నానీ.. అరెస్ట్ కాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేసారు. కేసు కొట్టేయాలని, అలాగే హైకోర్ట్ లో ముందస్తు బెయిల్ పిటీషన్ వేసారు. దీనిపై విచారణ జరిపిన కోర్ట్.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నో చెప్పింది. ఇక బెయిల్ పిటీషన్ పై విచారణను 22కి వాయిదా వేసింది. దీనితో నానీ ఎస్కేప్ అయిపోయారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదు చేసారు. హైకోర్ట్ లో ముందస్తు బెయిల్ రావడం కష్టమే అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
Also Read : అమ్మో గాయాలు.. భారత్ కు షాక్ ల మీద షాక్ లు
రక్షణ లభించకపోవడంతో నానీ జాగ్రత్తగా ఎస్కేప్ అయిపోయారు. ఆయన కోసం ప్రస్తుతం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. బెయిల్ వస్తేనే నానీ కనపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయనతో పాటుగా బందరుకి చెందిన పలువురు నాయకులు కూడా అజ్ఞాతంలోనే ఉన్నారు. మిథున్ రెడ్డినే అరెస్ట్ చేస్తే తానెంత అనుకున్నారో ఏమో గాని బయట ఉండటం మంచిది కాదనుకున్నారు అంటున్నాయి రాజకీయ వర్గాలు.