Friday, September 12, 2025 03:00 PM
Friday, September 12, 2025 03:00 PM
roots

రంగంలోకి దువ్వాడ.. వాళ్లే టార్గెట్..!

దువ్వాడ శ్రీనివాస్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్లు లేరు అంటే అతిశయోక్తి కాదు. పొలిటికల్‌ సర్కిల్‌లో అయితే ఓ ట్రెండ్ సెట్టర్ కూడా. 60 ఏళ్ల వయసులో మరో మహిళతో సహజీవనం చేస్తూ.. సోషల్ మీడియాలో వీడియోలతో రచ్చ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన దువ్వాడ శ్రీనివాస్.. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిందే లేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజకీయాల్లోకి వచ్చిన దువ్వాడ.. నాటి నుంచి ప్రతి ఎన్నికలో పోటీ చేస్తూనే ఉన్నారు. తొలి నుంచి కింజరాపు కుటుంబంపైనే దువ్వాడ కాలు దువ్వుతూ వస్తున్నారు. వైసీపీలో చేరిన తర్వాత దువ్వాడ పొలిటికల్‌గా మరింత బలపడ్డారనేది వాస్తవం.

Also Read : అసలు వాళ్లంతా ఏమయ్యారు.. ఎక్కడున్నారు..?

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దువ్వాడకు దూకుడుకు బ్రేకులు లేకుండా పోయాయి. ఎమ్మెల్యేగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు సొంత ఊరిలో, ఆయన ఇంటి ముందే కత్తులతో స్వైర విహారం చేశారు. సినిమా స్టైల్‌లో జీపు మీద కూర్చుని బూతులతో రెచ్చిపోయారు. జగన్ తన దేవుడంటూ పలు ఇంటర్వ్యూల్లో ఏడ్చేసిన దువ్వాడకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. అయితే పార్టీ ఓడిన తర్వాత దువ్వాడ దూకుడుకు బ్రేకులు పడ్డాయి. కుటుంబంలో వివాదం చెలరేగింది. దివ్వెల మాధురి వ్యవహారం బయటపడింది. దువ్వాడ ఇంటి ముందు ఆయన భార్య, పిల్లలు ఆందోళన చేపట్టారు. దీంతో నెల రోజుల పాటు దువ్వాడ ఎపిసోడ్ పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఆ సమయంలో దువ్వాడ, దివ్వెల జోడి చేసిన కొన్ని వ్యాఖ్యలు వైసీపీ నేతలకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. ప్రస్తుత రాజకీయాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు మంచి ఫ్యూచర్ ఉందని.. పరిపాలన చాలా చక్కగా ఉందన్నారు దువ్వాడ. దీంతో దువ్వాడపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వైసీపీ అధిష్ఠానం.. అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది.

Also Read : మరో మాజీ మంత్రికి లిక్కర్ దెబ్బ

తనపై వేటు పడిన తర్వాతు దువ్వాడ మరింత దూకుడు పెంచారు. వైసీపీకి వ్యతిరేకంగా బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇక టెక్కలిలో నియోజకవర్గం సమన్వయకర్తగా పేరాడ తిలక్‌కు అవకాశం ఇచ్చిన వైసీపీ.. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణికి కూడా కీలక బాధ్యతలు అప్పగించింది. ఇది శ్రీనివాస్‌కు కొంత ఇబ్బంది పెట్టేలా ఉందనేది ఆయన సన్నిహిత వర్గాల మాట. దీంతో వైసీపీ పెద్దలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దువ్వాడ. వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తనకు వైసీపీ నేతలు ఆర్థికంగా నష్టం చేశారని విమర్శలు చేశారు. ఇటీవల టెక్కలిలో తన అభిమానులు, కార్యకర్తలతో దువ్వాడ సమావేశమయ్యారు. పొలిటికల్ ఫ్యూచర్‌పై దృష్టి పెచ్చారు. ఏ పార్టీలో చేరితే బెటర్ అనే విషయంపై చర్చించారు.

Also Read : సాయి సుదర్శన్ కు ఎందుకీ అన్యాయం..?

దువ్వాడ సన్నిహితుల సూచన మేరకు రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్‌తో పాటు అచ్చెన్నాయుడుపైన ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీలోకి దువ్వాడ వచ్చే పరిస్థితి లేదు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ.. వైసీపీ ప్రభుత్వంలో పవన్‌పై పలు సందర్భాల్లో దువ్వాడ నోరు జారారు. దీంతో జనసేన పార్టీ కూడా దువ్వాడకు నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. ఇక బీజేపీలోకి వెళ్లినా పెద్దగా ఉపయోగం ఉండదనేది దువ్వాడ అభిప్రాయం. దీంతో రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమే ఉత్తమమని భావించారు. శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడకు ప్రత్యేక ఇమేజ్ ఉంది. అందుకే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే.. ఆ ప్రభావం వైసీపీపై స్పష్టంగా ఉంటుందనేది ఆయన సన్నిహితుల మాట. అప్పుడు వైసీపీ ఓడిపోతుందని.. అప్పుడైనా దువ్వాడ విలువ వైసీపీకి తెలిసి వస్తుందని సూచించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు దువ్వాడ శ్రీనివాస్‌ కూడా అంగీకారం చెప్పినట్లు సమాచారం. దువ్వాడ పోటీ చేస్తే.. వైసీపీ ఓటు బ్యాంక్ చీలిపోతుందనేది సిక్కోలు వాసుల మాట. మరి దువ్వాడ టెక్కలి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారా.. లేక శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారా అనేది తెలియాలంటే.. ఎన్నికల వరకు ఆగాల్సిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్