Friday, September 12, 2025 08:40 PM
Friday, September 12, 2025 08:40 PM
roots

ఇండియన్స్ కు ఎక్స్ గుడ్ న్యూస్

భారత్ లో తమ మార్కెట్ ను విస్తరించుకునే ప్రయత్నాలు చేస్తున్న అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X సబ్ స్క్రిప్షన్ ధరలను భారీగా తగ్గించారు మస్క్. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత బ్లూ టిక్ కోసం కొంత రుసుము విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు మస్క్. తాజాగా ఆ సబ్‌స్క్రిప్షన్ ఫీజులను 48 శాతం వరకు ఎక్స్ తగ్గించిందని ప్రకటించారు. దీనితో భారత్ లో మరింత మందికి ఎక్స్ ను దగ్గర చేయాలని మస్క్ భావిస్తున్నారు.

Also Read : అమరావతి ల్యాండ్ పూలింగ్ కూటమి కి లాభమా.. నష్టమా?

మొబైల్ యాప్ ప్రీమియం ఖాతా సబ్‌స్క్రిప్షన్ ఫీజును దాదాపు 48 శాతం తగ్గించి, నెలవారీగా గతంలో వసూలు చేసిన రూ.900 నుండి రూ.470కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎక్స్ లో ప్రీమియం, ప్రీమియం-ప్లస్ సర్వీస్ సబ్‌స్క్రైబర్లకు ఐడీ పక్కన చెక్‌ మార్క్‌ ను ఇస్తుంది. అదేవిధంగా, ఎక్స్ వెబ్ ఎకౌంటు లకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఫీజును దాదాపు 34 శాతం తగ్గించి, గతంలో ఉన్న రూ.650 నుండి రూ.427కి తగ్గించింది. యాప్ స్టోర్‌లు వసూలు చేసే అదనపు ఫీజుల కారణంగా మొబైల్ యాప్‌లలో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు రూ.470 వరకు ఉన్నాయి.

Also Read : స్విచ్ లు మాన్యువల్ గా ఆపలేం.. అనలిస్ట్ సంచలన కామెంట్స్

బేసిక్ సబ్ స్క్రైబర్ లకు కూడా కూడా గుడ్ న్యూస్ చెప్పింది. నెలవారీ చార్జీలను 30 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో గతంలో రూ.243.75గా ఉండే చార్జ్ ఇప్పుడు రూ.170కి తగ్గింది. బేసిక్ సబ్ స్క్రైబర్ లు పోస్ట్‌ లను ఎడిట్ చేయడానికి, లాంగ్ కంటెంట్ రాసేందుకు, ప్లే బ్యాక్, వీడియోలను డౌన్లోడ్ చేసుకునే ఫీచర్లు కల్పించింది. ఏడాది చార్జీలను కూడా తగ్గించింది. వార్షిక సభ్యత్వ రుసుము దాదాపు 34 శాతం తగ్గింది. తగ్గించిన తర్వాత రూ.1,700 చార్జ్ చేయనుంది. ఇప్పటి వరకు రూ.2,590.48 చార్జ్ చేసింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్