ఉగ్రవాదుల విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర చర్చ జరుగుతోంది. భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రోత్సహిస్తూ వస్తోన్న ఆ దేశం దావూద్ ఇబ్రహీం సహా పలువురు కీలక ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ వస్తోంది. మసూద్ అజర్, హఫీజ్ వంటి ఉగ్రవాదాలను భారత్ కు అప్పగించే ప్రయత్నాలు చేస్తామని చెప్తూనే ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హామీ ఇచ్చినా సరే ఇప్పటి వరకు పాకిస్తాన్ లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) చీఫ్ హఫీజ్ సయీద్, జైషే ముహమ్మద్ (జెఇఎం) చీఫ్ మసూద్ అజార్‌లను అప్పగించలేదు.
Also Read : యువ టెన్నిస్ స్టార్ రాధిక హత్య పై అడవి శేష్ ఎమోషనల్ పోస్ట్
ఆయన పార్టీ మద్దతు ఇస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా వేయలేదు. 26/11 ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రస్తుతం ఉగ్రవాదానికి నిధులు సమకూర్చినందుకు 33 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 26/11 దాడులు, 2001 పార్లమెంటు దాడి, 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి మరియు 2019 పుల్వామా ఉగ్రవాద దాడితో సహా భారతదేశంలో జరిగిన అనేక ప్రధాన దాడులకు మసూద్ అజార్ నేతృత్వం బాధ్యత వహించాడు.
Also Read : ఇదేం బంతిరా బాబూ.. 18 ఓవర్లకే కంప్లైంట్..!
814 కాందహార్ ఫ్లైట్ హైజాక్ సమయంలో బందీల మార్పిడి ఒప్పందంలో భాగంగా బిజెపి నేతృత్వంలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం 1999లో అజార్‌ను నిర్బంధం నుండి విడుదల చేసింది. ఆ తర్వాత దేశంలో ఎన్నో దాడులకు అతను నాయకత్వం వహించాడు. పాకిస్తాన్ ఆర్మీ సహకారంతో నిర్వహిస్తున్న మదర్సాలలో అతను పెద్ద ఎత్తున ఉగ్రవాదులను తయారు చేస్తున్నాడు. యువతను ఉగ్రవాదం వైపుగా నడిపించేందుకు అతను పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి పరోక్ష ఆర్దిక సహకారం తీసుకుంటున్నాడు అనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ విషయంలో భారత్ ఒత్తిడి చేస్తున్నా సరే.. అమెరికా నుంచి సహకారం ఉండటంతో వారిని ఉగ్రవాదులుగా ప్రకటించడమే గాని చర్యలు తీసుకునే పరిస్థితి మాత్రం కనపడటం లేదు.