Friday, September 12, 2025 08:40 PM
Friday, September 12, 2025 08:40 PM
roots

బజ్ బాల్ ఎక్కడ..? భారత్ బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ కు షేక్ అయింది…!

బజ్ బాల్” సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ కు కొత్త హంగులు అద్దిన వ్యూహం. జట్టు ఏదైనా బాదుడే లక్ష్యంగా పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. అగ్రశ్రేణి జట్లపై కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసి.. బోరింగ్ టెస్ట్ క్రికెట్ లో డిఫెన్స్ అనే మాటకు అర్ధం లేకుండా చేసింది. కాని భారత్ దెబ్బకు ఆ వ్యూహాన్ని పక్కన పెట్టేసింది ఇంగ్లాండ్ జట్టు. సిక్సులు, ఫోర్లతో అలరించే ఇంగ్లాండ్ ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ ఆటగాళ్ళు.. ఫోర్ కొట్టాలంటే చాలు కంగారు పడ్డారు. ఫ్రంట్ ఫుట్ కు వచ్చి షాట్ ఆడాలంటే భయపడ్డారు.

Also Read : ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆకుకూర కోసం ఎందుకంత డిమాండ్?

ఎంతటి లక్ష్యాన్ని అయినా చేధిస్తాం అనే ధీమాలో ఉన్న వాళ్లకు రెండో టెస్ట్ లో ఊహించని షాక్ తగిలింది. ఆ షాక్ దెబ్బకు సైలెంట్ అయిపొయింది ఇంగ్లాండ్. డిఫెన్స్ మర్చిపోవడమే రెండో టెస్ట్ లో వాళ్ళ ఓటమికి ప్రధాన కారణం. జూలై 10, గురువారం లార్డ్స్‌ లో క్రికెట్ ఆడిన 1980ల జట్టులా కనపడింది ఇంగ్లాండ్ జట్టు. రోజంతా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు.. కేవలం 251 పరుగులు చేసింది. వాస్తవానికి 450 పై చిలుకు పరుగులు చేయాల్సిన జట్టు.. వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చింది.

Also Read : ఆ నియోజకవర్గాలకు కొత్త బాసులు..!

ఇంగ్లాండ్ జట్టు 2022లో బజ్‌బాల్ ను మొదలుపెట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్ పై తొలి రోజు ఏకంగా 500కు పైగా పరుగులు చేసింది. కాని నిన్న మాత్రం క్రీజ్ లో నిలబడితే చాలు అన్నట్టుగా ఆడారు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు. బహుశా 3 సంవత్సరాలుగా ఇంగ్లాండ్ ఇంత స్లోగా ఆడలేదు. ఒక్క రోజులో 370 పరుగులు చేసి గెలిచిన జట్టు ఇదేనా అనే అనుమానాలు కూడా వచ్చాయి. జో రూట్ 51.83 స్ట్రైక్ రేట్‌తో 191 బంతులు ఆడాడు. అద్భుతమైన షాట్లకు పేరుగాంచిన కెప్టెన్ బెన్ స్టోక్స్ 38.24 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేసాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ఎవరూ కూడా 60 స్ట్రైక్ రేట్ కంటే ఎక్కువ చేయలేకపోవడం గమనార్హం. కాగా మొదటి రోజు ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్