స్వదేశంలో మ్యాచ్ ల కంటే విదేశాల్లో జరిగే మ్యాచ్ లే భారత క్రికెట్ జట్టు లోపాల గురించి చర్చలకు దారి తీస్తున్నాయి. జట్టు ఎంపిక, మైదానంలో జరిగే వ్యవహారాలన్నీ హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో కొన్ని విమర్శలు వచ్చాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ సందర్భంగా భారత జట్టు యాజమాన్యం జట్టు ఎంపికలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఒక మ్యాచ్ తర్వాత యువ బ్యాట్స్ మన్ సాయి సుదర్శన్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశ్నలు లేవనెత్తారు.
Also Read : రవిశాస్త్రి లేకపోతే నేను లేను.. టెస్ట్ క్రికెట్ నుంచి అందుకే రిటైర్ అయ్యా..!
ఓ క్రికెట్ ఛానల్ తో మాట్లాడిన ఆయన.. విజయం సాధించడంతో కొన్ని విషయాలు మాట్లాడటం లేదని.. కాని తాను జట్టు సెలెక్షన్ ను సమర్ధించలేను అంటూ అసహనం వ్యక్తం చేసారు. అతను భవిష్యత్తు ఉన్న ఆటగాడు అని, మొదటి టెస్ట్ లో అతను బ్యాటింగ్ బాగా చేసాడని, ఇది ఖచ్చితంగా తప్పే అంటూ మండిపడ్డారు. సాయి సుదర్శన్‌ను 3వ స్థానంలో ఆడించడమే మంచిది అన్నాడు సంజయ్. నా దృష్టిలో కరుణ్ నాయర్ మూడో స్థానంలో లేడు అని కామెంట్స్ చేసాడు.
Also Read : మరో మైలురాయిని అధిగమించిన శ్రీ సిటీ..!
కరుణ్ నాయర్ ఎంపిక, రీ ఎంట్రీ చుట్టూ ఉన్న కథల కారణంగా అతనికి మరో ఛాన్స్ వస్తుందని తాను భావిస్తున్నా అంటూ అభిప్రాయపడ్డాడు. ఇక రెండో టెస్ట్ గెలిచినా సరే.. నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ కృష్ణ విఫలం కావడం విమర్శలకు దారి తీసింది. బౌలింగ్ విభాగంలో బలహీనతలు ఎక్కువ ఉన్నా సరే.. బౌలింగ్ మార్చకుండా, బ్యాటింగ్ లో మార్పులు చేయడం ఆశ్చర్యపరిచిన అంశంగా చెప్పాలి. ఇక శార్దుల్ ఠాకూర్ ను కూడా మొదటి టెస్ట్ తర్వాత పక్కన పెట్టడంపై విమర్శలు వచ్చాయి.