ఏపీలో వైసీపీ నేతలు ఈ మధ్య కాలంలో చేస్తున్న కార్యక్రమాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వైఎస్ జగన్ ప్రజల్లోకి రావడం, కామెడి సీన్స్ చేసి వెళ్ళడం పదే పదే జరుగుతున్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. రాజకీయంగా బలహీనంగా ఉన్న పార్టీని ప్రజల్లో నిలపడం కంటే వార్తల్లో నిలపడమే జగన్ కు పెద్ద సవాల్ గా మారింది. వైసీపీ నేతలు కూడా సైలెంట్ గా ఉండటంతో నెలకు రెండు కార్యక్రమాలు జగన్ క్రియేట్ చేసి ప్రజల్లోకి రావడం మనం గత మూడు నాలుగు నెలలుగా చూస్తూనే ఉన్నాం.
Also Read : తీరు మారలేదు.. కారణం ఇదేనా..!
లేటెస్ట్ గా ఆయన చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వెళ్ళారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ బెంగళూరు నుంచి బంగారు పాల్యం అనే గ్రామానికి వెళ్ళారు. ఆయన వచ్చినప్పుడు ట్రాక్టర్ లతో మామిడి పంటను రోడ్ల మీద పోసిన వీడియోలు బయటకు వచ్చేసాయి. ఈ విషయాన్ని ఏపీ మంత్రులు ఆధారాలతో సహా బయట పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనితో వైసీపీ సోషల్ మీడియా సైలెంట్ అయిపొయింది.
Also Read : ఆ ఇద్దరినే నమ్ముతున్న చంద్రబాబు.. ఐపిఎస్ లే బాబు టార్గెట్..?
పదే పదే జగన్ పర్యటనల గురించి హైప్ ఇచ్చే వైసీపీ సోషల్ మీడియా ఈ విషయంలో మౌనంగా ఉంది. జగన్ టూర్ మీద ముందు నుంచి పెద్దగా ఫోకస్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. నిన్న టీడీపీ అన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కూడా వైసీపీ కార్యకర్తలు సైలెంట్ గానే ఉండిపోయారు. వైసీపీ నేతలు కూడా ప్రభుత్వ ఆరోపణలు తప్పు అనే మాట మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. లేదంటే వైసీపీ అనుకూల మీడియా కూడా అక్కడికి వెళ్లి, రైతుల కష్టాలను సైతం చూపించే ప్రయత్నం చేయలేదు. మరి దీని వెనుక కారణాలు ఏంటో ఆ పార్టీకే తెలియాలి.