ఏపీలో వైసీపీకి తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి మధ్య దగ్గరి అనుబంధం ఉందనే విషయం అందరికి క్లారిటీ ఉంది. ఏపీలో జగన్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ చక్కగా వాడుకుంది. తమ ప్రాంతానికి ఏపీలో ఉన్న ప్రముఖ కంపెనీలను ఏర్పాటు చేయించే దిశగా జగన్ సర్కార్ తో అప్పట్లో ప్రయత్నాలు చేయించింది. అందుకే అమర్ రాజా బ్యాటరీస్, లూలు మాల్ సహా ఎన్నో కంపెనీలు తెలంగాణా వెళ్లి పెట్టుబడులు పెట్టాయి. వీళ్ళు ఇద్దరికీ ఉమ్మడి రాజకీయ శత్రువు చంద్రబాబు కావడం కూడా ఆశ్చర్యం కలిగించింది.
Also read : తీరు మారలేదు.. కారణం ఇదేనా..!
2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు తెలంగాణా నుంచి కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసారు. అప్పట్లో టీడీపీ నేతలను వేధించే కార్యక్రమాలు జరిగాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ తో జగన్ రాజకీయ శత్రువుల ఫోన్ లను కూడా తెలంగాణా ప్రభుత్వం ట్యాపింగ్ చేయించింది. ఇక అవకాశం దొరికిన ప్రతీసారి కెటిఆర్.. వైసీపీ మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో కూడా ఆయన బాగా ఎంజాయ్ చేసారు. ఇక ఇప్పుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also read : మరో మైలురాయిని అధిగమించిన శ్రీ సిటీ..!
ఏపీలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం తనకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది అని వ్యాఖ్యానించారు. వైసీపీ ఓడిపోయినా సరే 40 శాతం ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి అని అన్నారు. ఇది మామూలు విషయం కాదని కొనియాడారు. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే ఫలితాలు మరోలా ఉండేవి అని అభిప్రాయపడ్డారు. జగన్ ను ఓడించేందుకు ఆయన సోదరిని వైఎస్ షర్మిలను పావులా వాడుకున్నారని.. అంతకు మించి ఆమె పాత్ర ఏమీ లేదన్నారు. ప్రతీ రోజు ప్రజల్లోకి వెళ్ళే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమే అంటూ ఢిల్లీలో కామెంట్స్ చేసారు.