Friday, September 12, 2025 08:52 PM
Friday, September 12, 2025 08:52 PM
roots

మంత్రులలో ప్రోగ్రెస్ రిపోర్ట్ భయం..?

ఆంధ్రప్రదేశ్ మంత్రులలో ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ భయం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఈ ఏడాది కాలంలో అన్ని శాఖల మంత్రుల పని తీరు ఎలా ఉంది అనే దానిపై సిఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు అనే ప్రచారం చూస్తూనే ఉన్నాం. పలు సందర్భాల్లో మంత్రులకు ఆయన వార్నింగ్ లు కూడా ఇచ్చారని, కొందరు మంత్రుల సమయ పాలన విషయంలో కూడా వార్నింగ్ లు వెళ్లాయని ప్రచారం చూసాం. సోషల్ మీడియా విషయంలో కూడా ఇలాగే కాస్త హడావుడి జరిగింది.

Also Read : మళ్లీ తెరపైకి బిర్యానీ వార్..!

అయితే ఇప్పుడు ప్రభుత్వంలో వినపడుతున్న మాట ప్రకారం, మంత్రుల మీడియా సమావేశాలు, పని తీరు, శాఖాపరమైన సమీక్షా సమావేశాలు, ప్రతిపక్షాల విషయంలో చేస్తున్న విమర్శలు, వైసీపీ నేతల ప్రచారానికి కౌంటర్లు, సోషల్ మీడియా ప్రచారం, ఇంచార్జ్ మంత్రుల జిల్లాల వారీ పర్యటనలు, సొంత నియోజకవర్గంలో కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ప్రచారం, క్షేత్ర స్థాయి పర్యటనలు, అధికారిక కార్యక్రమాల అమలు తీరు… ఇలా అన్ని అంశాలను చంద్రబాబు పరిశీలిస్తున్నారట.

Also Read : బిజెపి తెలంగాణా అధ్యక్షుడు ఆయనేనా..? రేపే ఎంపిక..!

త్వరలోనే దీనికి సంబంధించి పలు నివేదికలను స్వయంగా మంత్రులకే చంద్రబాబు అందించనున్నారు. మొన్నా మధ్య ఫైల్స్ క్లియర్ చేసే విషయంలో ర్యాంకులు కూడా ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు కూడా అదే తరహాలో పని తీరు విషయంలో ర్యాంకులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక మంత్రి వర్గంలో మార్పులు చేర్పులకు సంబంధించి కూడా సిఎం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఒకరిద్దరు మంత్రులను పక్కన పెట్టె అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్