Friday, September 12, 2025 07:25 PM
Friday, September 12, 2025 07:25 PM
roots

కేఆర్‌పీఎస్‌కి తాత్కాలిక బ్రేక్..!

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి.. ఎమ్మార్పీఎస్ తరహాలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి.. కేఆర్‌పీఎస్‌కి ఊపిరి పోసి.. రోడ్డెక్కేందుకు సిద్ధమైన కాపు సంఘాల దూకుడుకు, కాపు సామాజికవర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బ్రేకు వేశారు. టీడీపీ యువనేత, మంత్రి లోకేష్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సానా సతీష్.. కేఆర్‌పీఎస్‌కు సన్నాహాలు చేసిన నాగేంద్రబాబుతో సహా దాదాపు రెండువందల మంది కాపులతో భేటీ అయ్యారు. దీనిని కాపు నేత గంధం పల్లంరాజు అనుసంధాన కర్తగా వ్యవహరించారు.

కాగా.. మహారాష్ట్రలో మరాఠాల తరహాలో ఏపీలో కూడా కాపులకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ బెజవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కాపు సంఘం నేతలు వెల్లడించారు. అయితే ఈ విషయం కాపు వర్గాల్లో కలకలం రేపింది. ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో నిఘా వర్గాలు దానిపై దృష్టి సారించాయి. దీనితో నష్ట నివారణకు రంగంలోకి దిగిన మంత్రి లోకేష్.. దిద్దుబాటు చర్యలకు దిగాలని ఎంపీ సానా సతీష్‌ను ఆదేశించారు. ఆయన కాపు నేతలతో భేటీ కావడం చకచకా జరిగిపోయింది.

Also Read : కర్ణాటకకు పాకిన ఫోన్ ట్యాపింగ్.. భయంతోనే వాళ్ళ ఫోన్లు కూడా..?

అసలేం జరిగింటే.. మహారాష్ట్రలో మరాఠాలకు, అక్కడి బీజేపీ సర్కార్ 10 శాతం రిజర్వేషన్ ఇచ్చినట్లే.. ఏపీలో కూడా కాపులకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న డిమాండ్‌తో, కాపు రిజర్వేషన్ పోరాట సమితికి ఊపిరి పోసేందుకు కాపు నేతలు సిద్ధమయ్యారు. కాకినాడకు చెందిన కాపు నేత జె.నాగేంద్రబాబు ఆధ్వర్యంలో ఈనెల 29న విజయవాడలో ఎమ్మార్పీఎస్ మాదిరిగానే.. కెఆర్‌పీఎస్‌ను, రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు చైర్మన్‌గా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ మేరకు నాగేంద్రబాబు రాష్ట్రంలోని కాపు సంఘాలకు సమాచారం పంపించారు.

ఈ విషయం వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన మంత్రి లోకేష్.. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టాలంటూ కాపు నేత, ఎంపీ సానా సతీష్‌ను ఆదేశించారు. దానితో రంగంలోకి దిగిన సతీష్.. వివాదరహితుడైన కాపు నేత గంధం పల్లంరాజుతో చర్చించారు. ఉద్యమాలకు బదులు, ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కరించుకుందామని పల్లంరాజుకు సతీష్ సూచించారు. కూటమి ప్రభుత్వం కాపు సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉందని.. ఈ సమయంలో ఉద్యమాలు అవసరం లేదన్నారు కూడా. ప్రభుత్వం కూడా కాపు సమస్యలపై సానుకూలంగా ఉన్నందున, కాపు నేత నాగేంద్రబాబుతో చర్చించి ఉమ్మడి సమావేశానికి ఒప్పించాలని, కాపు నేత పల్లంరాజును ఎంపీ సానా సతీష్ అభ్యర్థించారు.

Also Read : విజయమ్మ ఫోన్ కూడా.. అమ్మకు జగన్ మరో గిఫ్ట్..!

ఎంపీ సానా సతీష్ అభ్యర్థన మేరకు రంగంలోకి దిగిన పల్లంరాజు.. కాపు నేత నాగేంద్రబాబుతో చర్చించారు. అటు ఎంపీ సతీష్ సైతం, నాగేంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. కాపు సమస్యలపై చర్చిద్దామని.. అప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని అటు సతీష్, ఇటు పల్లంరాజు సూచించినట్లు సమాచారం. దానికి అంగీకరించిన నాగేంద్రబాబు.. కాపు సమస్యలు పరిష్కారమవడమే ముఖ్యమని, సానా సతీష్ ప్రతిపాదనను అంగీకరించారు.

కాకినాడలో కాపు ముఖ్య నేతలతో సానా సతీష్ సమావేశమయ్యారు. దీనికి సమన్వయకర్తగా వ్యవహరించిన గంధం పల్లంరాజు..ఉద్యమాలతో లాభం లేదని, మన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి.. వాటిని పరిష్కరించుకునే అంశంపై దృష్టి సారిస్తే బాగుంటుందని సూచించారు. అలాగే కాపు, బలిజ, ఒంటరి కులాల సమస్యలు పరిష్కరించేందుకు చర్చించాలని మరో కాపు నేత ఆరేటి ప్రకాష్ సూచించారు. కాపుల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే అవకాశం ఇప్పుడే వచ్చిందన్నారు. గత ఎన్నికల్లో కూటమిపై నమ్మకంతోనే కాపులు ఓటు వేసి గెలిపించారని.. కాపుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పెంటపాటి పుల్లారావుతో కూడా చర్చించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కాపులకు న్యాయం జరిగేలా చూస్తామన సానా సతీష్ హామీ ఇవ్వడంతో… కాపు సభ వాయిదా వేస్తున్నట్లు పుల్లారావు ప్రకటించారు.

Also Read : మళ్లీ తెరపైకి బిర్యానీ వార్..!

కాపు సమస్యలు పరిష్కారం కావాలన్న సదుద్దేశంతో సభను వాయిదా వేసినట్లు నాగేంద్రబాబు ప్రకటించారు. కేఆర్‌పీఎస్ సభ వెనుక ఏ రాజకీయ పార్టీ లేదన్నారు. అయితే తోట త్రిమూర్తులతో ఈ విషయంపై గతంలో చర్చించిన విషయం వాస్తవమే అని అంగీకరించారు. అన్ని పార్టీల్లోని కాపులతో తాను మాట్లాడినట్లు నాగేంద్రబాబు వెల్లడించారు. రాయలసీమలో బలిజ సర్టిఫికేట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో కాపు కార్పోరేషన్‌కు 5 వేల కోట్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని.. దానికి నిధులు కేటాయించాలని కోరారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర వంటి ఆరు రాష్ట్రాల్లో కాపులు వివిధ పేర్లతో చెలామణి అవుతున్నారు. మహారాష్ర్ట ప్రభుత్వం మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లే, ఏపీలో కూడా 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఇవ్వడంపై ఎవరైనా కోర్టుకు వెళితే అది నష్టం కలిగిస్తుందని.. కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని ఎంపీ సానా సతీష్ హామీ ఇచ్చారు.

త్వరలో నిర్వహించే సమావేశంలో కాపు సంఘాల ప్రతినిధులు హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆయా కాపు సంఘాల ప్రతినిధులు ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. వాటిని ప్రభుత్వానికి పంపుతామన్నారు. అన్ని డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్నారు. త్వరలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అపాయింట్‌మెంట్ తీసుకుని కాపు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళతానని ఎంపీ సానా సతీష్ హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు కాపులు అండగా ఉన్నారని నాగేంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం కాపులను ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఏ కులంతో కూడా పోటీ పడటం లేదని… న్యాయంగా తమకు రావాల్సినవి మాత్రమే అడుగుతున్నామన్నారు. మరాఠాల తరహాలో కాపులకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు కూడా. కాపు జాతి ప్రయోజనాల కోసం ఎలాంటి రాజీ పడేది లేదన్నారు.

Also Read : సీతక్కకు షాక్ ఇచ్చిన మావోయిస్ట్ లు..!

రాజ్యసభ సభ్యులు సానా సతీష్ జోక్యం వల్లే విజయవాడలో తలపెట్టిన కాపు రిజర్వేషన్ పోరాట సమితి సభను నిర్వాహకులు వాయిదా వేశారు. లేదంటే కాపులు మరోసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడెక్కేవారే. సానా సతీష్ రాజీ యత్నాలు ఫలించడంతో టీడీపీ నేతలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్