Friday, September 12, 2025 07:34 PM
Friday, September 12, 2025 07:34 PM
roots

మళ్లీ తెరపైకి బిర్యానీ వార్..!

ఇప్పుడు హాట్ టాపిక్ బిర్యానీ గురించే.. ప్రపంచంలో మరే సమస్య లేనట్లుగా ఇప్పుడు బిర్యానీ గురించే చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ ధమ్ కీ బిర్యానీ వరల్డ్ ఫేమస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఆయా ప్రాంతాల్లో ఒక్కొ రకం వంట ఫేమస్. అది ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా.. మరే రాష్ట్రం, ప్రాంతమైనా సరే.. స్థానిక వంటకం ఒకటి ఉంటుంది. అది ఆ ప్రాంతానికి గుర్తింపు తీసుకువస్తుంది కూడా. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ కారణంగా అన్ని వస్తువులు.. అన్ని చోట్ల దొరుకుతున్నాయి. కానీ ప్రతిసారి హైదరాబాద్ ధమ్ కీ బిర్యానీ చుట్టూ మాత్రమే ఎందుకు వివాదం చెలరేగుతుంది అంటే.. దీని వెనుక రాజకీయ కోణం ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది.

హైదరాబాద్ ధమ్ కీ బిర్యానీ ఫేమస్. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు ఇది ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా దొరుకుతుంది. అయితే తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరుకున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. నీళ్లు, నిధులు, కొలువులు పేరుతో ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్.. చివరికి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బిర్యానీ సూపర్ అంటూనే.. ఆంధ్రోళ్ల బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా.. అని వెటకారంగా వ్యాఖ్యలు చేశారు. అది పెండలాగ ఉంటుందని హీనమైన కామెంట్లు చేశారు. ఇక పూజలు చేసే బ్రాహ్మణులపై కూడా నీచమైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. వాళ్లకు మంత్రాలే రావని.. అసలు వాళ్లు చేసేవి పూజలే కావన్నారు. ఆంధ్రోళ్లన్ని తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ మాటలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి.

Also Read : సీతక్కకు షాక్ ఇచ్చిన మావోయిస్ట్ లు..!

2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఏపీలో చాలాసార్లు పర్యటించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అదే రోజు మాజీ మంత్రి రోజా ఇంట్లో ఆతిధ్యం స్వీకరించారు. అప్పుడు రాయలసీమ స్పెషల్ వంటకాలను లొట్టలేసుకుని ఆవురావురంటూ తిన్నారు. ఆహా సూపర్‌గా ఉంది విందు భోజనం అని కితాబిచ్చారు కూడా. ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని ప్రాంతాల వారు హైదరాబాద్‌లో ఉండొచ్చని.. ఇది అందరి నగరమని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఇక సరిగ్గా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం.. మళ్లీ పాత పాటే పాడారు. మళ్లీ ఆంధ్ర వాళ్ల పెత్తనం అంటూ ప్రాంతీయ ఫీలింగ్ తీసుకువచ్చేందుకు ఎంతగానో ప్రయత్నం చేశారు కేసీఆర్.

ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ బయటికే రావటం లేదు. పూర్తిగా ఫామ్ హజ్‌కే పరిమితమయ్యారు. కన్న కూతురు కవిత లిక్కర్ కేసులో అరెస్టైనప్పుడు, పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకున్నప్పుడు కూడా కేసీఆర్ నోరు విప్పలేదు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కనీసం బోణీ కూడా కొట్టలేదు. దీంతో పరువు పోయిందని భావించిన కేసీఆర్ ఇంటికే పరిమితమయ్యారు. ఇక అన్న కేటీఆర్‌ తీరును పరోక్షంగా తప్పుబడుతూ కేసీఆర్‌కు కవిత లేఖ రాశారు. ఇది పెద్ద దుమారం రేపింది. నాటి నుంచి పార్టీలో అన్న చెల్లెళ్ల మధ్య వార్ నడుస్తోంది. పార్టీని బీజేపీలో కలిపేందుకు కుట్ర చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఇక తన జాగృతిని బలోపేతం చేసుకునేందుకు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న కవిత.. తాజాగా బిర్యానీపై నోరు జారారు. ఆంధ్రోళ్ల బిర్యానీ ఎట్లుండదో కేసీఆర్ సార్ చెప్పిండు కదా.. అని మరోసారి నోరు పారేసుకున్నారు. దీంతో ఇప్పుడు కవితపై సెటైర్లు వేస్తున్నారు.

Also Read : విజయమ్మ ఫోన్ కూడా.. అమ్మకు జగన్ మరో గిఫ్ట్..!

తీహార్ జైలులో బిర్యానీ బాగుందా అని సోషల్ మీడియాలో కవితపై విమర్శలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్‌లో తిన్న డబ్బుల ముందు బిర్యానీ ఏం బాగుంటుంది లే కవితక్క.. అని పోస్ట్ చేస్తున్నారు. అధికారంలోకి రావడానికే ఇలా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులూ అందరూ మనవాళ్లే అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల ఫుడ్ అందుబాటులో ఉంది. టెక్ ఇండస్ట్రీ కారణంగా అన్ని రాష్ట్రాల వాళ్లు ఉంటున్నారు. ప్రస్తుతం గ్లోబర్ విలేజ్ అనే విషయం మర్చిపోయిన కవిత.. మళ్లీ ప్రాంతీయ విద్వేషాల కారణంగానే ఓట్లు రాబట్టాలనే దురుద్దేశ్యంతో రాజకీయం చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్