Friday, September 12, 2025 11:16 PM
Friday, September 12, 2025 11:16 PM
roots

సీతక్కకు షాక్ ఇచ్చిన మావోయిస్ట్ లు..!

ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ లను టార్గెట్ చేసుకున్న సమయంలో.. మావోయిస్ట్ పార్టీ మళ్ళీ ప్రజా ఉద్యమాల వైపు అడుగులు వేస్తోంది. తాజాగా మంత్రి సీతక్కను లక్ష్యంగా చేసుకుని మావోయిస్ట్ లు ఓ లేఖ విడుదల చేసారు. సీతక్కకు వార్నింగ్ ఇస్తూ లేఖ విడుదల చేసారు. ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా.. మంత్రి సీతక్క మౌనంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేసారు అన్నలు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read : భారత్ కు బూమ్రా షాక్.. రెండో టెస్ట్ లో కష్టమే

ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా, 1/70 చట్టాలను మంత్రి సీతక్క మరచిపోయారా…? అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని స్పష్టం చేసిన మావోయిస్టులు.. జీవో నెంబర్. 49తో కుమురం భీమ్ జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తోందని.. జీవో కారణంగా రాష్ట్రంలో మూడు జిల్లాలు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు.

Also Read : ఆస్ట్రేలియాకు మొగుడులా తయారైన బౌలర్

జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేసారు. ఈ లేఖపై మంత్రి సీతక్క రియాక్ట్ అయ్యారు. మావోయిస్ట్ ల లేఖను అడ్డం పెట్టుకుని తనను టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అ లేఖ మావోయిస్టు పార్టీ ఇచ్చిందా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదని.. అయితే లేఖ‌లో లేని అంశాల‌పై ఒక రాజ‌కీయ‌ పార్టీ ప‌త్రిక‌లు, మీడియా సంస్థ‌లు సొంత వ్యాఖ్యానాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసులకు మేలు చేసేలా అధికారాన్ని వినియోగిస్తున్నానన్నారు. అడ‌వి బిడ్డ‌ల ప‌ట్ల‌ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్న అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నామని తెలిపారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్