ఏపీ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ వ్యవహారాలు ఈ మధ్య కాలంలో కాస్త హాట్ హాట్ గా నడుస్తున్నాయి. తనను.. తన అన్న మోసం చేసారని ఆరోపించిన వైఎస్ షర్మిల.. జగన్ పై పెద్ద పోరాటమే చేస్తూ వస్తున్నారు. రాజకీయంగా ఇది వైసీపీకి పెద్దగా మైనస్ గా మారిన విషయం అర్ధమవుతోంది. వైసీపీలో ఉన్న కీలక నాయకులను కూడా ఈ పరిణామాలు భయపెడుతున్నాయి. తెలంగాణాలో పార్టీ పెట్టిన షర్మిల.. ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. ఏపీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారు.
Also Read :
ఇక జగన్ తల్లి విజయమ్మ ప్రస్తుతం షర్మిలతోనే ఉంటున్నారు. జగన్ ను కలిసిన సందర్భాలు కూడా ఈ మధ్య కాలంలో తక్కువ అనే చెప్పాలి. ఇక తన తల్లిపై కూడా కోపంగా ఉన్న జగన్ ఆమెను కోర్ట్ కు లాగారు. తాజాగా వైఎస్ విజయమ్మ ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించినట్లు ఓ వార్త బయటకు వచ్చింది. ఇటీవల వైఎస్ షర్మిల ఫోన్ ట్యాప్ అయిందని, ఆమె తో పాటుగా ఆమె భర్త ఫోన్ కూడా ట్యాప్ అయిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా విజయమ్మ ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించారు.
Also Read :
తన తల్లి తనకు ఎదురు తిరగడం, షర్మిలకు అనుకూలంగా వ్యవహరించడంతోనే ఫోన్ ట్యాపింగ్ చేయించారట. వైఎస్ షర్మిల, విజయమ్మ ఫోన్ లు ఒకేసారి ట్యాప్ అయ్యాయి అని తేల్చారు. ఆ సమయంలో తెలంగాణా నుంచి విజయమ్మ ఫోన్ ట్యాపింగ్ చేసి.. వైసీపీలోని కీలక వ్యక్తికి సమాచారం అందించారట. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. తనకు విజయమ్మ ఎదురు తిరిగితే.. రాజకీయంగా, ఆర్ధికంగా నష్టపోయే అవకాశం ఉండటంతోనే జగన్ ఫోన్ ట్యాపింగ్ చేయించి ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి.




