Friday, September 12, 2025 10:57 PM
Friday, September 12, 2025 10:57 PM
roots

ఎవరికి ఎవరు కనిపించటం లేదు.. జస్ట్ ఆస్కింగ్..!

ఆ ఎమ్మెల్యే ఎక్కడికి పోయారు.. అసలు ఆ ఎమ్మెల్యే ఉన్నారా.. ఆ ఎమ్మెల్యే కనిపించటం లేదు.. ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. అసలు ఎమ్మెల్యే కనిపించకపోవడం ఏమిటీ.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడం ఏమిటీ.. అనే అనుమానం ప్రతి ఒక్కరిలో వస్తుంది. వాస్తవానికి ప్రతి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తన నియోజకవర్గం అభివృద్ధి గురించి.. నియోజకవర్గం సమస్యల గురించి తప్పని సరిగా ప్రస్తావించాలి. ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేయాల్సిందే. ఇక మంత్రులు, మాజీలు అయితే.. ఎక్కువగా రాష్ట్ర స్థాయి సమస్యలపై ప్రస్తావించాల్సిందే. కానీ ఏపీలో జరుగుతున్నది ఏమిటీ.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.

Also Read : యోగాంధ్ర టార్గెట్ అదే.. బాబు రీచ్ అవుతారా..?

వైసీపీ నేతలు ఏపీలో తమ ఉనికి కాపాడుకునేందుకు ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇక ఇటీవల విడుదల చేసిన తల్లికి వందనం పథకం వల్ల కూటమి ప్రభుత్వం గ్రాఫ్ భారీగా పెరిగింది. 2 వేలు కోత పెట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నప్పటికీ.. ప్రజలు మాత్రం.. తమ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ డబ్బులు ఇచ్చారని సంబరాలు జరుపుకుంటున్నారు. పాఠశాలలు ప్రారంభం నాటికే నిధులు వేయడం వల్ల ఫీజులు ముందే చెల్లించగలుగుతున్నామంటున్నారు కూడా. దీంతో వైసీపీ నేతలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.

ఇక పార్టీ మనుగడ కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శించారు. ఈ పర్యటన కోసం పెద్ద ఎత్తున చుట్టు పక్కల ప్రాంతాల నుంచి జనాన్ని తరలించారు కూడా. ఇక ఆ పర్యటనపై ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం కూడా రేగుతోంది. ఇదే పర్యటన సమయంలో ఇద్దరు మృతి చెందారు. ఇక పల్నాడు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు చేసిన హంగామా కారణంగా.. మైలేజ్ కంటే కూడా చెడ్డ పేరే ఎక్కువగా వచ్చింది. దీనికి తోడు కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ప్లాన్ రివర్స్ అయ్యిందని భావించిన వైసీపీ నేతలు ఇప్పుడు మరో కొత్త పాట పాడుతున్నారు.

Also Read : సాక్షిగా బండి సంజయ్.. ఫోన్ ట్యాపింగ్ లో బిజెపి ఎంటర్ అయినట్టే..?

ఏపీలో కూటమి పాలనలో ప్రజలు నానా పాట్లు పడుతున్నారని.. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని.. ప్రజా ప్రతినిధులు అందుబాటులో లేరని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురించే ప్రస్తావిస్తున్నారు. మీ ఎమ్మెల్యే ఏమయ్యారు అంటూ ఇటీవల వైసీపీ మహిళా నేత శ్యామల బహిరంగ వేదికపై ఫోటోలు చూపించిన వీడియోను బాగా వైరల్ చేస్తున్నారు. అలాగే మహిళపై దాడులు పెరిగిపోయాయని.. హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ఎక్కడా అంటూ మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. దీనికి కూటమి నేతలు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గానికి బాలకృష్ణ ఎంతో చేశారన.. అందుకే వరుసగా మూడోసారి కూడా బాలకృష్ణ గెలిచారంటున్నారు. సినిమాల కారణంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నప్పటికీ.. హిందూపురం కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో ఉన్నారని వీడియోలు చేస్తున్నారు.

ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తున్నారు. కానీ ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని కూడా పవన్ నియమించారని.. అలాగే తన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబును పిఠాపురంలో పవన్ అందుబాటులో ఉంచిన విషయం తెలియదా అని వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ గురించి పక్కన పెట్టాలని.. అసలు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించరా అని నిలదీస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రికి ఏపీ ప్రజల సమస్యలు పట్టవా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అసలు జగన్ ఎక్కడున్నారో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్