ఒంగోలు లోక్‌సభ స్థానాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జగన్ ఖరారు చేయడంతో బాలినేని వర్గం భగ్గుమంది. ఒంగోలులో ఆయనకు స్వాగతం చెపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎవరో చించేశారు. మంత్రి మేరుగ నాగార్జున కార్యాలయం వద్ద, జిల్లా వైసీపి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించేశారు.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట కాదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎంపీ సీటు ఖరారు చేయడంతో పాటు, జిల బాధ్యతలను కూడా అప్పగించినందున తీవ్ర ఆగ్రహంతో ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరులే ఈ పని చేస ఉంటారని వేరే చెప్పక్కరలేదు.
చెవిరెడ్డి జిల్లాలో అడుగు పెట్టక మునుపే బాలినేని తన ప్రతాపం ఈవిదంగా చూపడంతో ఒంగోలు వైసీప నిలువునా రెండుగా చీలిపోయిన్నట్లయింది. కానీ నేటికీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపిలోనే ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ ఆయనకు టికెట్ ఇవ్వడంపై జగన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కనుక ఈ ఫ్లెక్సీల వ్యవహారంలో ఆయనన వేలెత్తి చూపలేని పరిస్థితి నెలకొంది. అందుకే మంత్రి మేరుగ నాగార్జున ఆయనను వెనకేసుకు వస్తూ మాట్లాడాల వచ్చింది.
“బాలినేని శ్రీనివాస్ రెడ్డిగారు మా పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. మేమందరం ఆయనను చాల గౌరవిస్తాం. చెవిరెడ్డి విషయంలో ఆయనకు అసంతృప్తిగా ఉన్న మాట నిజమే కావచ్చు కానీ ఆ కారణంగా ఆయన ఇటువంటి పనులు చేయిస్తారని అనుకోము.
ఎవరో ఆకతాయిలు చేసిన ఈ పనికి ఆయనని నిందించడం సరికాదు. మా పార్టీ కార్యాలయం వద్ద చెవిరెడ్డిక స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించేశారనే వార్తలు నిజం కావు. బాలినేనితో కలిసి, ఆయన నేతృత్వంలో మేమందరం పనిచేయాలనుకుంటున్నాము. ఆయన కూడా తప్పకుండా మాతో కలిస పనిచేస్తారనే నమ్మకం నాకుంది,” అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.
జగన్ ఎంపిక చేసిన చెవిరెడ్డి ఫ్లెక్శీలను చించితే ఏమవుతుందో బాలినేని వర్గానికి బాగా తెలుసు. కానీ ఇప్పటిక ఎమ్మెల్యే బాలినేని, ఎంపీ మాగుంట ఇద్దరూ పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నారు. కనుకనే బాలినేని వర్గం ఇంత సాహసం చేసి ఉండవచ్చు.
అయితే బాలినేని, మాగుంట వారంతట వారు బయటకుపోతే మంచిదని జగన్‌తో సహా ఒంగోలు వైసీపిల అందరూ ఎదురుచూస్తున్నారు. ఒకవేళ పోకపోతే వారిద్దరినీ మెడ పట్టుకుని బయటకు గెంటేయడం తధ్యమే. ఈ విషయాలన్నీ సామాన్య ప్రజలకు కూడా తెలుసు. కానీ మంత్రి మేరుగ ఇంకా కవరింగ్ ఇస్తున్నారు!