యువగళం పాదయాత్ర.. ఏపీ రాజకీయాల్లో ఓ సంచలన మలుపు. వైసీపీ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ అప్పట్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పెద్ద ఎత్తున ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వేల కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్రలో లోకేష్ ఎందరినో పలకరించారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు సాగిన ఈ యాత్ర ఓ సంచలనం అనే చెప్పాలి. టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి, పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళడానికి ఈ యాత్ర ఎంతగానో ఉపయోగపడింది అనే చెప్పాలి.
Also Read : ద్వారంపూడికి మ్యూజిక్ స్టార్ట్ అయినట్టే..?
నేడు పాదయాత్రకు సంబంధించి.. అనుభవాలను పొందుపరిచిన భారీ పుస్తకాన్ని మంత్రులు అందరికి అందించారు లోకేష్. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ పై పవన్ కళ్యాణ్ ప్రసంశలు కురిపించారు. ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తీసుకొచ్చారని కొనియాడారు. ఈరోజుకు అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికీ జనం మర్చిపోలేదన్నారు పవన్ కళ్యాణ్.
Also Read : తిరుమల కల్తీ నెయ్యి కేసులో వారిపైనే గురి..!
ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. జగన్ రాక్షస పాలనపై సమర శంఖంలా యువగళం అంటూ యువగళం పుస్తకాన్ని ఆకాశానికి ఎత్తేసారు లోకేష్. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సైతం లోకేష్ ను అభినందించారు. యువ గళం యాత్రతో లోకేష్ ప్రజల్లోకి వెళ్ళిన విధానం బాగుందని, అప్పట్లో వైసీపీ నేతలు ఎన్ని రకాలుగా అవమానంగా మాట్లాడినా లోకేష్ అనుకున్నది సాధించారని కొనియాడారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.