చంద్రబాబు అంటే.. అందరికీ గుర్తుకు వచ్చేది విజనరీ అనే మాట. 20 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో.. వాటిని ముందే ఊహించగల ఏకైక లీడర్ అనేది చంద్రబాబుకు ఉన్న పేరు. భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేయగల సమర్థులు కూడా. 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. విజన్ 2020 పేరుతో భారీ ప్రణాళిక రూపొందించారు. అందుకు అనుగుణంగానే హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చేందుకు అడుగులు వేశారు. ఆ రోజు తీసుకున్న చర్యల కారణంగానే ప్రస్తుతం తెలంగాణ ఆదాయంలో హైదరాబాద్ నగరానిదే 60 శాతం వాటా. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని ప్రముఖ సంస్థల కార్యాలయాలు హైదరాబాద్‌లో కూడా ఉన్నాయంటే.. అందుకు నాడు చంద్రబాబు తీసుకున్న చర్యలే కారణమనేది వాస్తవం.
Also Read : తిరుమల కల్తీ నెయ్యి కేసులో వారిపైనే గురి..!
నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు. అందులో భాగంగానే అమరావతి నగర నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సంకల్పించారు. అలాగే భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు భూసేకరణ చేశారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం, తిరుపతి సమీపంలోని శ్రీ సిటిని ఎలక్ట్రానిక్ హబ్‌గా మార్చేశారు. ఇక కరవు ప్రాంతం అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమను స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పించారు. అదే సమయంలో నాటి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పలుమార్లు చర్చించిన చంద్రబాబు సాగర్ మాల ప్రాజెక్టు కింద సరుకు రవాణా కోసం పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
Also Read : ఎందుకీ శాడిజం..? హెలికాప్టర్, సైకిల్.. ఇప్పుడు పోలీస్ వ్యాన్
ఐదేళ్ల విధ్వంసకర పాలన తర్వాత నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనా పరంగా అనేక మార్పులు తీసుకువచ్చారు చంద్రబాబు. ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రజల అభివృద్ధికి దోహదపడుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు కూడా. ఇందులో భాగంగానే కొత్తగా లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇది దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న కార్పొరేషన్. దీని వల్ల ప్రజలకు ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున వస్తాయని.. అలాగే అభివృద్ధి కూడా జరుగుతుందని హామీ ఇచ్చారు. లాజిస్టిక్స్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని పోర్టులు, మౌలిక సదుపాయాలు, రహదారుల అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందన్నారు.
Also Read : ద్వారంపూడికి మ్యూజిక్ స్టార్ట్ అయినట్టే..?
ఏపీలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టులు నిర్మించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తొలిదశలో అమరావతి, శ్రీకాకుళం, కుప్పం, దుగదర్తి ఎయిర్‌పోర్టుల నిర్మాణంపైనే లాజిస్టిక్స్ కార్పొరేషన్ దృష్టి పెట్టనుంది. ఇక వచ్చే ఏడాది నాటికి 4 పోర్టులతో పాటు 4 హార్బర్లు కూడా పూర్తి చేస్తామని చంద్రబాబు ఇప్పటికే వెల్లడించారు. ఇక ప్రభుత్వ – ప్రైవేటు – పబ్లిక్ భాగస్వామంతో పీపీపీ విధానంలో అన్ని రాష్ట్రస్థాయి రోడ్లను కూడా జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ప్రాజెక్టులను కూడా లాజిస్టిక్స్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది. రాష్ట్రంలోని అన్ని రహదారులను కూడా జాతీయ రహదారులతో లింక్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
Also Read : కామెడీ స్పీచ్ ఇరగదీసిన జగన్
ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. అందుకే తిరుగులేని మెజారిటీ ఇచ్చారని కూడా చంద్రబాబు వెల్లడించారు. ప్రజలను సంతోష పరిచేలా కూటమి పరిపాలన ఉండాలని కూడా సూచించారు. ఎవరో తప్పు చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వస్తే.. అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సమయంలో ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామన్నారు. ఈ పనులను మరింత వేగంగా పూర్తి చేసే లక్ష్యంతోనే కొత్తగా ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.