కడప మహానాడు.. తెలుగుదేశం పార్టీలో నయా జోష్ నింపింది. ఒంగోలు మహానాడు ఎన్నికల్లో గెలుపునకు కారణమైంది. అలాగే కడప మహానాడు వైసీపీ నేతల గుండెల్లో భయానికి కారణమైంది అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. వాస్తవానికి రాయలసీమలో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి పెద్ద సవాల్‌గా నిలిచింది ఉమ్మడి కడప జిల్లా. కొన్ని ఎన్నికల్లో కనీసం బోణీ కూడా కొట్టలేదు. అలాంటిది.. 2024 ఎన్నికల్లో మాత్రం పది నియోజకవర్గాల్లో ఏకంగా 7 స్థానాలు గెలిచింది టీడీపీ. బద్వేలు, పులివెందుల, రాజంపేట మినహా.. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగిరింది. చివరికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత మేనమామ రవీందర్ రెడ్డి కూడా కమలాపురం నియోజకవర్గంలో ఓడిపోయారు. రాజంపేటలో కూడా టీడీపీలో ఆధిపత్య పోరు కారణంగానే ఓడినట్లు అప్పట్లో తెలుగు తమ్ముళ్లే వెల్లడించారు.
Also Read : గద్దర్ అవార్డులు వీరికే.. ప్రకటించిన జ్యూరి
అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కడప జిల్లాపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని కట్టడి చేశారు. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే మిథున్ రెడ్డి చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది. దీంతో మిథున్ రెడ్డి ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉన్నారు. ఆ తర్వాత కడప మేయర్‌ను తప్పించారు. అయితే ఈ విషయంపై హైకోర్టు స్టే విధించింది. ఇక కడప జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారు. అందుకే మహానాడును కడపలో గ్రాండ్‌గా నిర్వహించారు. మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ పండుగ ఘనంగా నిర్వహించారు. చివరి రోజు బహిరంగ సభకు ఏకంగా 5 లక్షల మంది రావడం తెలుగు తమ్ముళ్లల్లో ఫుల్ జోష్ నింపింది.
Also Read : కేటీఆర్ కు మైనస్.. లోకేష్ కు ప్లస్ అదే
వాస్తవానికి కడపలో మహానాడులో అని ప్రకటించిన వెంటనే.. ఎన్నో అనుమానాలు.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అసలు కడపలో టీడీపీ మీటింగ్ ఎందుకు అని కొందరంటే.. కడపలో మహానాడు సక్సెస్ అవుతుందా అని కూడా అనుమానించారు. కానీ 3 రోజుల సంబరం గ్రాండ్ సక్సెస్ కావడంతో తెలుగు తమ్ముళ్లల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇదే సమయంలో వైసీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నట్లే పని చేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
Also Read : పని మనిషిలా కాదు ఇంటి ఆడబిడ్డలా సాగనంపారు
మహానాడు గ్రాండ్ సక్సెస్ తర్వాత వైసీపీ నేతల్లో అసహనం మొదలైంది. కేవలం వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేసేందుకే కడపలో మహానాడు నిర్వహించారని.. వైఎస్ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టారని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు వైసీపీ నేతలు. అయితే వీటికి టీడీపీ నేతలు ఘాటుగానే బదులిచ్చారు. గతంలో సిద్ధం సభలు పెట్టినప్పుడు, జగన్ పర్యటన సమయంలో కడపలో ఎన్టీఆర్ విగ్రహాలకు వైసీపీ తోరణాలు కట్టిన ఫోటోలను బయటపెట్టారు. దీంతో వైసీపీ నేతల నోటికి తాళం పడింది. కడప మహానాడు తర్వాత వైసీపీ మరింత బలహీనమైనట్లు ఇప్పటికే ప్రముఖ సర్వే సంస్థలు ఇప్పటికే నివేదికలిచ్చాయి. అటు జాతీయ మీడియా సంస్థలు కూడా లోకేష్ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. దీంతో వైసీపీ నేతల్లో పెద్ద ఎత్తున భయం మొదలైంది. కడప మహానాడు టీడీపీ, వైసీపీ నేతల్లో స్పష్టమైన మార్పులు తీసుకువచ్చిందనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది.