సాధారణంగా పనిమనుషులను కొంతమంది బానిసల మాదిరి చూస్తూ ఉంటారు. వాళ్లు ఎంత కష్టపడినా.. డబ్బులు ఇస్తున్నాం కదా అనే ధోరణిలోనే వ్యవహరిస్తూ ఉంటారు. ఇక కొంతమంది పని మనుషులు అయితే తమకు యజమాని ఎంత చేసినా సరే విశ్వాసం లేకుండా ఉండేవాళ్లు ఉంటారు. ఇంట్లో మనిషిలా చూసుకున్నా సరే కొంతమంది విశ్వాసం లేకుండా వెన్నుపోటు పొడిచే రకాలు ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కొంతమంది యజమానులు పని మనుషుల విషయంలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటూ ఉంటారు.
Also Read : బాలీవుడ్ మాఫియాను లెఫ్ట్ లెగ్‌తో తన్నిన సందీప్ రెడ్డి
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. పనిమనిషిని ఇంతగా ప్రేమిస్తారా అన్నట్లుగా ఉన్న ఆ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఏళ్ల తరబడి తమ ఇంట్లో పనిమనిషిగా చేసిన వ్యక్తికి ఘనంగా వీడ్కోలు పలికింది ఓ కుటుంబం. అసలు ఏంటా కథ.. అనేది ఒకసారి చూస్తే.. సోషల్ మీడియాలో ఆ కుటుంబం గురించి పూర్తి వివరాలు లేకపోయినా.. వీడియో ఆధారంగా చూస్తే.. ఎన్నో ఏళ్ల పాటు తమ ఇంట్లో పనిచేసిన పనిమనిషికి పెళ్ళి కుదిరింది. దీనితో ఆ అమ్మాయి పని మానేయాల్సిన పరిస్థితి వచ్చింది.
Also Read : మరో షాక్ ఇవ్వడానికి రెడీ అయిన కోహ్లీ..?
ఇది యజమాని కుటుంబాన్ని ఎంతగానో బాధ పెట్టింది. తమ ఇంట్లో మనిషిలా నమ్మకంగా పనిచేసిన అమ్మాయి వెళ్ళిపోతుంటే.. ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆ అమ్మాయికి బట్టలతోపాటు కుంకుమ పెట్టి, డబ్బులు ఇచ్చి పంపించారు. తమకోసం పనిచేసిన పనిమనిషి వెళ్ళిపోతుందనే బాధలో ఉన్న ఆ ఇంట్లో ఉన్న చిన్నారులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. పని మనిషిగా కాకుండా ఆడపడుచు గా చూసిన విధానానికి సోషల్ మీడియా జనం నీరాజనాలు పలుకుతున్నారు. నమ్మకానికి విశ్వాసానికి ఇచ్చే గుర్తింపు ఇది అంటూ కొనియాడుతున్నారు.