Friday, September 12, 2025 08:59 PM
Friday, September 12, 2025 08:59 PM
roots

కాకాణి అరెస్ట్.. వైసీపీలో కలవరం..!

ఏపీలో మరో మాజీ మంత్రి అరెస్టు అయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని ఏపీ పోలీసులు కేరళలో అరెస్టు చేశారు. రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కాకాణి ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. అయితే కాకాణి దాఖలు చేసిన ముందస్తు పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. కేరళలో దాక్కున్న కాకాణిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నెల్లూరు జిల్లా వెంకటాచలం తరలించారు. నెల్లూరులోని డీటీసీలో కాకాణిని పోలీసులు విచారించారు. అక్రమ మైనింగ్ చేసి ప్రభుత్వానికి 2 వేల కోట్ల పైగా విలువైన క్వార్ట్జ్‌ను విదేశాలకు తరలించినట్లు కాకాణిపై ఆరోపణలు.

Also Read : రిటర్న్ గిఫ్ట్ కు థాంక్స్.. టాలీవుడ్ పై పవన్ ఫైర్

కాకాణిపై తప్పుడు కేసులు పెట్టారని తొలి నుంచి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలను వేధించడమే ఏకైక లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తోందన్నారు. అయితే ఏ తప్పు చేయకపోతే.. కాకాణి ఎందుకు పారిపోయినట్లు అనే ప్రశ్నలకు మాత్రం వైసీపీ నేతల నుంచి ఎలాంటి సమాధానం లేదు. తప్పు చేసిన వాళ్లు మాత్రమే పారిపోతారని కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. మంత్రిగా పని చేసిన రెండేళ్లల్లోనే ఏకంగా 2 వేల కోట్ల విలువైన క్వార్ట్జ్‌ను అక్రమంగా మైనింగ్ చేసి తరలించారనేది ప్రధాన ఆరోపణ. అయితే కాకాణి అరెస్టుతో వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. కాకాణి అరెస్టు ఖాయమని ముందు నుంచే వైసీపీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తప్పు చేశాడు కాబట్టే ఇలా దాక్కున్నారని కొందరు వైసీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో ఇతర వైసీపీ నేతలపై కూడా కాకాణి దౌర్జన్యాలు చేశాడనేది సొంత పార్టీ నేతల ఆరోపణ.

Also Read : పహల్గాం దాడికి నెల.. ఆ ఆరుగురు ఎక్కడ..?

అయితే కాకాణి అరెస్టు తర్వాత వైసీపీలో కలవరం మొదలైంది. నెక్ట్స్ ఎవరూ అనే ప్రశ్న జోరుగా వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. లిక్కర్, మైనింగ్, శాండ్, రైస్ మాఫియా రెచ్చిపోయిందనేది మొదటి నుంచి టీడీపీ నేతల ఆరోపణ. అలాగే ప్రజాధనం కూడా పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు పాత్రధారులను మాత్రమే అరెస్టు చేశారు. సూత్రధారులు కూడా లబ్దిదారులు ఇప్పటికీ బయటే ఉన్నారు. ఇక వల్లభనేని వంశీని కూడా టీడీపీ ఆఫీసుపై దాడి కేసులోనే అరెస్టు చేశారు తప్ప.. అవినీతి ఆరోపణల కేసు ఇంకా విచారణకు రావాల్సి ఉంది. ప్రభుత్వ సంపదను దోచేసిన కేసుల్లో ఇప్పటికి కాకాణిని మాత్రమే అరెస్టు చేశారు. ఇంకా ఆడుదాం ఆంధ్ర, అటవీ భూముల ఆక్రమణ వంటి కేసుల్లో ఇంకా విచారణ జరుగుతోంది.

Also Read : పవన్ పై దిల్ రాజు కుట్ర.. జనసేన సంచలనం

కాకాణి అరెస్టు తర్వాత మరో మాజీ మంత్రులు కొడాలి నాని, ఆర్కే రోజా, కారుమూరి నాగేశ్వర్రావు, అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతల్లో భయం మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొడాలి నానిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో వందల కోట్ల అవినీతి చేశారని ఆర్కే రోజాపై ఫిర్యాదులు. టీడీఎస్ బాండ్ల కేసులో కారుమూరి చుట్టూ ఆరోపణలున్నాయి. అటవీ భూములు అక్రమించిన కేసులో పెద్దిరెడ్డి, సజ్జలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తర్వాత ఎవర్ని అరెస్టు చేస్తారనే ప్రశ్న జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే కొడాలి నాని అమెరికా వెళ్లేందుకు ప్లానే చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజా కూడా పూర్తిగా తమిళనాడుకే పరిమితమయ్యారు. పెద్దిరెడ్డి జాడ లేదు. దీంతో తర్వాత అరెస్టు ఎవరిదీ అని వైసీపీ నేతలు కలవరపడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్