Friday, September 12, 2025 09:02 PM
Friday, September 12, 2025 09:02 PM
roots

ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్న ధోనీ.. షాకింగ్ డెసిషన్..?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.. మరో ఐపీఎల్ సీజన్ ఆడనున్నాడా..? ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ కు ఐదేళ్ల క్రితం గుడ్ బై చెప్పిన.. ధోని అప్పటినుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. ప్రతి ఏటా ధోని రిటైర్ అవుతాడనే వార్తలు వినపడుతూనే ఉన్నాయి. నాలుగేళ్ల నుంచి దీనికి సంబంధించి ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ధోని మాత్రం ఐపీఎల్ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు.

Also Read : అక్కడికి రాహుల్ వచ్చేస్తున్నాడు..? బెర్త్ ఖరారు

ధోని కి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకున్న ఆ జట్టు యాజమాన్యం.. అతను కొనసాగాలని కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఏడాది ఐపీఎల్ సీజన్లో ధోని పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీనిపై చెన్నై అభిమానులు కూడా బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. జట్టు ఎంపిక విషయంలో కూడా ధోని సమర్థవంతంగా వ్యవహరించలేదు అనే ఆరోపణలు సైతం వినిపించాయి. దీంతో ధోని తప్పుకుంటే మంచిది అని చాలామంది అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేశారు. దీనిపై జాతీయ మీడియాలో సైతం చర్చలు జరిగాయి.

Also Read : సాయి సుదర్శన్ స్పాట్ ఫిక్స్..?

ఇక ఈ సీజన్ తర్వాత ధోని ఐపిఎల్ క్రికెట్ కు కూడా గుడ్ బై చెప్పవచ్చు అని భావించినా.. ధోని మాత్రం ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో సీజన్లో ధోని కనపడనున్నాడు. ప్రస్తుతం ధోనీ వయసు 43 ఏళ్లు. ఫిట్నెస్ పరంగా కూడా ధోని అంత సమర్థవంతంగా కనబడడం లేదు. దానికి తోడు బ్యాటింగ్ లో విఫలమౌతూ వస్తున్నాడు. కీలక సమయాల్లో ధోని విఫలం కావడం జట్టు విజయావకాశాలపై ప్రభావం పడుతుంది. మరి వచ్చే ఐపీఎల్ సీజన్ కూడా ధోని ఆడాలి అనుకుంటే అభిమానుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. చాలామంది అభిమానులు బహిరంగంగానే.. ధోని జట్టుకు భారంగా మారాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్