తెలంగాణలో భారత రాష్ట్ర సమితి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే తిరిగి అధికారాన్ని చేజాక్కించుకోవాలని తీవ్రంగా కష్టపడుతుంది. రాజకీయంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలంగా కనబడుతున్నా.. భవిష్యత్తులో ఆ పార్టీకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీనితో భారత రాష్ట్ర సమితి క్రమంగా బలపడే ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఇటీవల కేసిఆర్ కూడా అధికార పార్టీపై పోరు తీవ్రతరం చేశారు. ఆ పార్టీ ఆవిర్భావ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కేసీఆర్ వైఖరిని స్పష్టంగా బయటపడ్డాయి.
Also Read :అందరి పేర్లు రాసిపెట్టుకోండి..జగన్ 2.0లో తేలుస్తా..!
ఇదే సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు విషయంలో ఏం జరగబోతోంది అనేదే ఆసక్తిని రేపుతోంది. ఈ మధ్యకాలంలో ఆయన సొంత పార్టీ పెట్టబోతున్నారని, లేదా టిడిపిలో జాయిన్ కాబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే హరీష్ రావు విషయంలో గులాబీ పార్టీ లో ఉన్న అగ్ర నాయకత్వం కాస్త దురుసుగానే వ్యవహరిస్తోంది అనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఈ మధ్యకాలంలో కేటీఆర్, కవిత ఇద్దరు హరీష్ రావుని టార్గెట్ చేశారనే వార్తలు వచ్చాయి.
Also Read :అణు దాడికి సిద్దమవుతున్న పాక్.. షరీఫ్ కీలక సమావేశం
ఈ సమయంలో హరీష్ రావుతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని ఓ ప్రచారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలన రేపుతోంది. ఆయనకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి పదవితో పాటుగా ముఖ్యమంత్రి పదవిని కూడా బిజెపి పెద్దలు ఆఫర్ చేసినట్లు.. రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాజకీయాల్లో కేటీఆర్ కంటే హరీష్ రావు సీనియర్. గులాబీ పార్టీలో కేటీఆర్ కంటే హరీష్ రావుకు పట్టు ఎక్కువ.. దానికి తోడు సొంత నియోజకవర్గంలో ఆయనను ఎదుర్కోవటం కూడా కష్టమే.
Also Read : తప్పు చేసిన వాడ్ని వదలను.. చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్
ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆయనకు మంచి పట్టు ఉంది. అన్ని పార్టీల నేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. దీనితో హరీష్ రావు బిజెపిలోకి వస్తే తమకు ప్రయోజనం ఉంటుందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇక హరీష్ రావు బిజెపిలోకి వచ్చే అంశంపై ఆ పార్టీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దీనితోనే బిజెపి పెద్దలు నేరుగా హరీష్ రావుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే హరీష్.. కాంగ్రెస్ విషయంలో, బిజేపీ విషయంలో సైలెంట్ అయినట్లు కనపడుతోంది.