భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య వాతావరణం రోజురోజుకు దిగజారుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొనసాగుతుందా లేదా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుతో పాటుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా వెనకడుగు వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఎట్టకేలకు ఆటగాళ్ల భద్రతతో పాటుగా ఐపీఎల్ మ్యాచ్లు చూడటానికి వచ్చే ప్రేక్షకుల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని.. ఐపీఎల్ సీజన్ ను రద్దు చేసింది బోర్డు.
Also Read : యుద్ధం మొదలైందా..? పాక్ టార్గెట్ చేసిన సిటీలు ఇవే
జనాలు ఒక్కచోటే మ్యాచులు చూసేందుకు చేరితే అనవసరమైన భద్రత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందని భావిస్తోంది భారత ప్రభుత్వం. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు బోర్డు కు సూచనప్రాయంగా తెలిపినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. శుక్రవారం దీనిపై నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించినట్లు గానే బోర్డు నిర్ణయం ప్రకటించింది. గురువారం సాయంత్రం ధర్మశాల వేదికగా పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను నిలిపివేశారు. ఆటగాళ్లను విమానంలో తరలించేందుకు సమస్యలున్న నేపథ్యంలో వారికోసం ప్రత్యేక వందే భారత్ రైలును ఏర్పాటు చేశారు.
Also Read : తర్వాతి కెప్టెన్ ఎవరు..? ఆ ముగ్గురికే ఛాన్స్
ఒకవేళ ఐపీఎల్ నిర్వహించిన సరే షెడ్యూల్లో మార్పులు చేస్తారని ప్రచారం జరిగింది. సురక్షిత నగరాలను ఎంపిక చేసుకుని ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించే అవకాశం ఉందని భావించారు. విశాఖపట్నం, హైదరాబాద్, అహ్మదాబాద్, నాగపూర్, కటక్, బెంగళూరు, పూణే వంటి నగరాల్లో ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించే అవకాశం ఉంది. ఈ నగరాల్లో దాడులు చేసే అవకాశం తక్కువ కావడంతో ఇక్కడ నిర్వహిస్తారని భావించారు. ఇక విదేశీ ఆటగాళ్లను సురక్షితంగా వారి వారి దేశాలకు తరలిస్తోంది బోర్డు.