ఒక ఊహ.. ఒక అద్భుతం.. ఒక సరికొత్త సాంకేతిక విప్లవం! మన కళ్ల ముందే ఆవిష్కృతం కాబోతోంది. విశ్వంలోని అత్యంత సంక్లిష్టమైన రహస్యాలను ఛేదించే శక్తి మన ముంగిట నిలవబోతోంది. అదే – క్వాంటం కంప్యూటింగ్! ఇది కేవలం ఒక సాంకేతికత కాదు.. ఇది భవిష్యత్తును మార్చేసే ఒక శక్తి!
సరికొత్త సాంకేతిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ కానుందా.. ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు 3 దిగ్గజ టెక్నాలజీ సంస్థలు ఎందుకు ముందుకు వచ్చాయి. అమరావతిలో నిర్మిస్తున్న టెక్ సిటీ ప్రపంచానికే తలమానికం కానుందా.. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ మొత్తం అమరావతి వైపు రానుందా.. అంటే.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. ఇందుకు ఏకైక కారణం క్వాంటం టెక్నాలజీ. 1995 వరకు సాంకేతిక పరిజ్ఞానం అంటే అందరికీ అమెరికాలోని సిలికాన్ వ్యాలీ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత టెక్ దిగ్గజాల దృష్టిని ప్రధానంగా ఆకర్షించిన నగరం హైదరాబాద్. హైటెక్ సిటీ నిర్మించిన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు… హైదరాబాద్ నగరంలో పెట్టుబడుల వేట ప్రారంభించారు. దీంతో ప్రపంచంలోని టాప్ సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్, టీసీఎస్, టెక్ మహీంద్ర వంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ సంస్థల కార్యాలయాలు ప్రారంభించాయి. ఆ తర్వాత సైబరాబాద్ అనే ఓ సరికొత్త నగరమే అక్కడ రూపొందింది.
Also Read : ఆ విషయంలో బాబు సర్కార్ ఫెయిల్..!
అయితే ఇప్పుడు మాత్రం సిలికాన్ వ్యాలీ అడ్రస్ గల్లంతు అయ్యేలా ఉంది. ఇందుకు ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే మాట బాగా వినిపిస్తోంది. అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు భారీ ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతి నిలిచేలా ఇప్పటికే ప్లాన్ చేశారు. భవిష్యత్ తరాల అవసరాలను ముందే గుర్తించిన చంద్రబాబు.. అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ నిర్మించాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం ప్రపంచంలోని మూడు దిగ్గజ టెక్నాలజీ, ఇంజనీరింగ్ సంస్థలు ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ – టీసీఎస్, లార్సెన్ & టూబ్రో – ఎల్ అండ్ టీ సంస్థలు మన రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఈ ప్రకటన చంద్రబాబు సమక్షంలోనే మే 2వ తేదీ ఉదయం వెలువడింది.
Also Read : ఎవరిని వదలం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
ఈ ప్రకటన వెలువడగానే ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాయి. అలాగే ఈ ప్రకటన వచ్చిన వెంటనే.. స్టాక్ మార్కెట్‌లో ఐబీఎం, టీసీఎస్ కంపెనీల షేర్లు స్వల్పంగా పెరిగాయి. ఇన్వెస్టర్లు ఈ దీర్ఘకాలిక పెట్టుబడిని ఒక సువర్ణావకాశంగా భావిస్తున్నారు. క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందనే నమ్మకంతో కొనుగోళ్లు పెరిగాయి. ఇక ఈ వార్త టెక్ సామ్రాజ్యంలో ఒక తుఫాన్‌లా వ్యాపించింది. క్వాంటం ఆంధ్రప్రదేశ్ అంటూ టెకీలు తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, యువత ఈ పరిణామాన్ని తమ భవిష్యత్తుకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో టెక్కీలు కేరింతలు కొడుతున్నారు.
Also Read : లిక్కర్ స్కామ్.. భారతీ అరెస్టు తప్పదా..?
టీసీఎస్, ఐబీఎంలు కూడా వారి కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌లలో ఈ సమాచారాన్ని వెల్లడించాయి. అమరావతిలో రూపుదిద్దుకోబోతోంది భారతదేశపు మొట్టమొదటి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్. ఇది కేవలం ఒక భవనం కాదు… ఇది భవిష్యత్తు తరాల పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఒక వ్యాలీ కాబోతోంది. ఈ టెక్ పార్క్‌ను జనవరి 1, 2026న దేశానికి అంకితం చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. క్వాంటం వ్యాలీ ఒప్పంద ప్రకటన వచ్చిన వెంటనే… దీని గురించి నెటిజన్లు సెర్చింగ్ మొదలు పెట్టారు. ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏమిటీ.. అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఏమిటీ అని.. అలాగే ఇందులో కొలువు తీరనున్న అద్భుతం ఏమిటని కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఐబీఎం సరికొత్త సృష్టి – ఐబీఎం క్వాంటం సిస్టమ్ టూ ఇక్కడే రానుంది. ఏకంగా 156 క్యూబిట్ల హెరాన్ క్వాంటం ప్రాసెసర్‌తో ఇది భారతదేశపు సాంకేతిక చరిత్రలో ఒక సంచలనం సృష్టించబోతోంది. సామాన్య కంప్యూటర్లు తలమునకలయ్యే లెక్కలను ఇది క్షణాల్లో పూర్తి చేయగలదు.
Also Read : అరెస్ట్ చేసేయండి.. లిక్కర్ స్కాంలో సుప్రీం షాక్
ఇక క్లిష్టమైన సమస్యలకు క్వాంటం పరిష్కారాలను కనుగొనడంలో, వైద్యం నుండి తయారీ వరకు వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో టీసీఎస్ తన మేధోశక్తిని ఉపయోగించనుంది. అంతేకాదు, ఈ టెక్ పార్క్‌లోని శాస్త్రవేత్తలకు ఐబీఎం శక్తివంతమైన క్లౌడ్ క్వాంటం కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ టెక్ పార్క్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఎల్ అండ్ టీ సంస్థ పర్యవేక్షిస్తుంది. దీని ద్వారా అత్యాధునిక సాంకేతికతకు అనుగుణంగా అన్ని హంగులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్వాంటం కలను నిజం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తోంది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ టెక్ పార్కును ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో ఉంది. దీని ద్వారా వేలాది అత్యాధునిక ఉద్యోగాలు రానున్నాయి. ప్రపంచ నలుమూలల నుండి మేధావులు అమరావతికి తరలివస్తారు. భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. జీఎస్‌టీ నిర్వహణ నుండి ఖచ్చితమైన జనాభా లెక్కల విశ్లేషణ వరకు, ప్రతి రంగంలోనూ క్వాంటం టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
Also Read : తోపుదుర్తి సేవలో రాప్తాడు పోలీసులు
ఆంధ్రప్రదేశ్ ఇక కేవలం ఒక రాష్ట్రం కాదు.. ఇది క్వాంటం విప్లవానికి కేంద్రం కాబోతోంది. జనవరి 1, 2026న చరిత్ర సృష్టించబోతోంది. పాతికేళ్ల క్రితం ఇలాగే సైలెంట్‌గా జీనోమ్ వ్యాలీకి ఒప్పందాలు చేసుకున్నారు చంద్రబాబు. అప్పుడు అంతా నవ్వారు. కానీ అది ఈ రోజు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికే వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా మారిపోయింది. అంతేందుకు కరోనా సమయంలో జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోసం ప్రపంచమే పడిగాపులు గాస్తూ ఎగబడి కొని వేయించుకొంది. ఇప్పుడు అమరావతి కూడా అంతే. క్వాంటం వ్యాలీగా మారి తీరుతుందని అంతా విశ్వసిస్తుంది.