Friday, September 12, 2025 10:56 PM
Friday, September 12, 2025 10:56 PM
roots

బ్యాంక్ ఖాతాలపై సంచలన నిర్ణయం

ఇక బ్యాంకు ఖాతాలో విషయంలో కీలక అడుగులు పడుతున్నాయి. సరికొత్త సంస్కరణల దిశగా బ్యాంకింగ్ రంగం అడుగులు వేస్తోంది. మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా ఖాతాలకు ముగ్గురు నామినీలు ఉండాలని.. వారిలో ఒకరి తర్వాత ఒకరిని హక్కుదారులుగా సూచించవచ్చని కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ఖాతాలోని ఆస్తిని శాతాల వారీగా కేటాయించే అవకాశం కూడా కల్పించారు. బ్యాంకింగ్ చట్టాల బిల్లు సవరణతో ఈ మార్పులు తీసుకు రానున్నారు. బ్యాంకు ఖాతాదారులు నలుగురిని నామినీలుగా నియమించుకునే అవకాశం కల్పించనున్నారు.

Also Read : పవన్ రాకతో విభేదాలు తొలగినట్లేనా..?

బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్యను తగ్గించే దిశగా కేంద్రం ఈ అడుగులు వేస్తోంది. ఇటీవలే బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లును పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితమే ఈ సవరణపై నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా నామినేషన్ నియమాలలో త్వరలో కీలక మార్పులు అమలులోకి వస్తాయి. బ్యాంకు ఖాతాలకు గతంలో కేవలం ఒక్క నామినీకి మాత్రమే అవకాశం కల్పించే వారు. దీని కారణంగా అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.

Also Read : కోహ్లీ.. కార్తిక్ మధ్య ఏం జరిగింది..?

నామినీ మరణించినా అతని ఖాతాలోని ఆస్తులు వారసులకు బదిలీ కాకపోవడం తలనొప్పిగా మారింది. ఇక రెండో నామినీ లేకపోవడం వల్ల చట్టపరమైన సమస్యలు కూడా చికాకుగా మారాయి. చివరికి పదేళ్ల తర్వాత ఖాతాలోని ఆస్తులు ఎవరికీ క్లెయిమ్ చేయకపోవడం వల్ల డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్నెస్ ఫండ్ కి అవి డిపాజిట్ అవుతున్నాయి. నలుగురు నామినీల్లో ఎవరిని హక్కుదారుగా నిర్ణయించాలనే నిర్ణయం బ్యాంకు ఖాతాదారుదే. ఇందుకోసం రెండు ఆప్షన్లను కేంద్రం ప్రతిపాదించింది.

Also Read : రాహుల్ కు బోర్డు బంపర్ ఆఫర్..?

మొదటి ఆప్షన్ లో ఓ ఖాతాదారుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉంటే అందరినీ నామినీలుగా పెట్టుకుని ఒకరి మరణానంతరం మరొకరిని హక్కుదారుగా ప్రస్తావించే అవకాశం ఇచ్చారు. తొలుత భార్య మరణిస్తే.. ఆమె మరణానంతరం కుమారుడు, అతని మరణానంతరం కుమార్తెలను హక్కుదారులుగా సూచించే అవకాశం కల్పించారు. రెండో ఆప్షన్ లో తన ఖాతాలోని ఆస్తిని శాతాలవారీగా నలుగురికీ కేటాయించే అవకాశం కల్పించారు. మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా, బ్యాంక్ ఈ రూల్ వర్తించనుంది. బ్యాంకు ఖాతాకు మాత్రమే నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం కల్పించగా.. మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా వంటి వాటికి ముగ్గురు నామినీలను నియమించే అవకాశం కల్పించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్