Saturday, September 13, 2025 01:22 AM
Saturday, September 13, 2025 01:22 AM
roots

రజనీకి స్టార్ట్ అయింది.. మరిది తర్వాత ఎవరు..?

మాజీ మంత్రి విడదల రజనీకి ఉచ్చు బిగుస్తోంది. గత ప్రభుత్వంలో ఆమె చేసిన అక్రమాలకు సంబంధించి పోలీసులు దూకుడు పెంచారు. వరుస ఫిర్యాదులు రావడంతో ఒక్కో కేసును బయటకు లాగుతున్నారు పోలీసులు. ముఖ్యంగా ఆమె మరిదిని అడ్డం పెట్టుకుని చిలకలూరిపేట నియోజకవర్గంలో చేసిన దారుణాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. గ్రానైట్ వ్యాపారులతో పాటుగా స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించిన సంఘటనలు వెలుగులోకి రాగా వాటిపై కేసు నమోదు చేసారు.

Also Read : యుద్ధంలోనే పుట్టాం.. యుద్దమే చేస్తాం

ఇక నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు ఆమె చేసిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు చేసారు. వాటిపై కూడా ఫోకస్ పెట్టి విచారణ చేస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె మరిది గోపిని హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపిని అరెస్ట్ చేసామని ఏసీబీ అధికారులు తెలిపారు. గోపిని హైదరాబాదులో అరెస్ట్ చేసిన ఏసీబీ… అక్కడి నుంచి విజయవాడ తరలిస్తోంది.

Also Read : సాయి రెడ్డే కీలకమా..? కసిరెడ్డి రిమాండ్ లో సంచలనాలు..!

యడ్లపాడులో కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారని గోపి పై కేసు నమోదు అయింది. మొత్తం రెండు కోట్ల రూపాయలకు ఒప్పందం చేసారు. గోపికి ఇందులో పది లక్షలు, ఐపిఎస్ అధికారి జాషువాకు పది లక్షలు, రజనీకి రెండు కోట్ల వరకు వచ్చాయి. ఇదే కేసులో రజనీ కూడా నిందితురాలుగా ఉన్నారు. కేసు నేపధ్యంలో ఎంపీతో ఆమె రాజీ ప్రయత్నాలు కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి. త్వరలోనే ఐపిఎస్ అధికారి జాషువాపై కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ చేసే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్