లిక్కర్ కేసులో కీలకంగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు ఏసీబీ కోర్ట్ లో ప్రవేశపెట్టారు. విచారణకు హాజరు అవుతాను అని చెప్పినా అరెస్టు చేశారని న్యాయమూర్తికి రాజశేఖర్ రెడ్డి తన వాదన వినిపించారు. కార్ సీజ్ చేసారు నా ఇంటితో పాటు నా బంధువుల ఇళ్లలో,స్నేహితుల ఇళ్లలో సోదాలు చేశారని కసిరెడ్డి న్యాయమూర్తికి తెలిపారు. సోదాల్లో ఏమైనా సీజ్ చేసారా అని న్యాయమూర్తి అడగగా.. కార్ తప్ప ఏమి సీజ్ చేయలేదని కసిరెడ్డి వివరించారు.
Also Read : అల్లు అర్జున్ పై క్రిమినల్ కేసు పెట్టాల్సిందే
విచారణ పేరుతో తల్లి తండ్రులను ఇబ్బందులు పెట్టారని న్యాయమూర్తికి కసిరెడ్డి తెలిపారు. సిట్ అధికారులే రిపోర్ట్ ఇచ్చారని తాను సంతకాలు చేయలేదని న్యాయమూర్తికి తెలిపాడు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడంపై సిట్ అధికారులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసారు. రిమాండ్ రిపోర్టులో కనీసం పారాలు లేవు… పేజి నెంబర్లు లేవని.. ఎఫ్ ఐఆర్ పేరు లేదు కదా ఎలా అరెస్ట్ చేశారు అని న్యాయమూర్తి ప్రశ్నించారు. సత్య ప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేశామని తెలిపారు అధికారులు.
Also Read : బీజేపీకే రాజ్యసభ.. లోకల్ కాదు నాన్ లోకల్
విచారణకు ఏ మాత్రం సహకరించట్లేదని.. న్యాయమూర్తికి తెలిపారు. పూర్తిస్థాయిలో కస్టడీకి తీసుకుని విచారణ చేయాలని ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదించారు. కోర్టు ప్రొసీజర్స్ ని ఫాలోవ్వాలని సుప్రీంకోర్టు ఎన్ని సార్లు చెప్పిన… మేము ఎన్నిసార్లు చెప్పినా మీలో మార్పు రావడం లేదని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్ట్. తాము చెప్తే కేసు వివరాలు ఇస్తారని.. ఆ తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి అని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసారు.
Also Read : అసలు దొంగ బీహార్ పారిపోయాడు: రఘురామ
ఇక కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పై పిసి యాక్ట్ (17ఏ)1988 ప్రకారం నమోదు చేస్తూ మెమో దాఖలు చేసిన తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసారు. గంట ముందు ఎలా మెమో దాఖలు చేస్తారని ప్రభుత్వ తరపు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. మెమో మళ్ళీ దాఖలు చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాదిని కోర్ట్ ఆదేశించింది. మెమో దాఖలు చేసిన తర్వాత కేసును మళ్ళీ కేసును విచారిస్తామని ఏసిబి కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేసారు.




