వై నాట్ 175 అని గొప్పలకు పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోతోంది. ఇప్పటికే పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎంపీలు సైలెంట్‌గా సైడ్ అయిపోతున్నారు. ఇక ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఫ్యాన్ ఆగిపోవడంతో.. గాలి ఆడక జనాల నుంచి వచ్చే విమర్శలు తట్టుకోలేక ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఇక ముఖ్యనేతలంతా కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో అసలు పార్టీ ఉంటుందా… మూత పడుతుందా అనే అనుమానంతో నేతలంతా తమ రాజకీయ భవిష్యత్తు కోసం దార్లు వెతుక్కుంటున్నారు. ఇప్పటికే పార్టీ సీనియర్ నేతల్లో చాలా మంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల్లో చేరిపోయారు. ఇప్పుడు ఇదే బాటలో మాజీ మంత్రి కూడా చేరిపోయారు.
Also Read : కోడెలకు అండగా నిలిచాననే జగన్ దూరం పెట్టారు: రఘురామ
2019 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్. నాటి వరకు ఎంపీగా కొనసాగిన అవంతిని భీమిలి నుంచి అసెంబ్లీ బరిలో దింపారు జగన్. వైసీపీ హవాలో 2019 ఎన్నికల్లో అవంతి ఘన విజయం సాధించారు. ఇక జగన్ సర్కార్ తొలి కేబినెట్‌లోనే అవంతికి చోటు దక్కింది. అదే సమయంలో రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరనున్నట్లు పుకార్లు ఇప్పట్లో పెద్ద ఎత్తున షికారు చేశాయి. వీటిపై అవంతి ఘాటుగా స్పందించారు. గంటా వస్తే ఊరుకునేది లేదంటూ తెగేసి చెప్పారు. ఈ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు మాజీ ఎంపీ, ఉత్తరాంధ్ర వైసీపీ మాజీ రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తీవ్రంగా కృషి చేశారు కూడా. కానీ అవంతి మాత్రం ససేమిరా అనేశారు. దీంతో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో అవంతి పోస్ట్ పీకేశారు జగన్.
Also Read : సాయిరెడ్డితో వైసీపీ రాజీ కష్టాలు
ఇక 2024 ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు అవంతి ఆడియో లీక్ అయ్యింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఇక 2024 ఎన్నికల్లో మరోసారి భీమిలి నుంచి పోటీ చేసిన అవంతి శ్రీనివాస్.. ఘోర పరాజయం పొందారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ భీమిలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు వచ్చింది. దీంతో పరువు పోయినట్లు భావించిన అవంతి.. రాజకీయాలకు దూరమయ్యారు. ఓడిన తర్వాత సరిగ్గా 2 నెలలకే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు అవంతి ప్రకటించారు. నాటి నుంచి ఆయన ఏ పార్టీలో చేరుతారా అనే ప్రశ్న వినిపిస్తూనే ఉంది. కొందరు తిరిగి టీడీపీలో చేరుతారని భావించగా.. మరికొందరు బీజేపీ అన్నారు. అయితే వీటన్నిటికీ అవంతి బ్రేక్ వేసినట్లు అయ్యింది. సరిగ్గా రెండు రోజుల క్రితం అవంతి శ్రీనివాస్ కుమార్తె ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక జనసేనలో చేరారు. ప్రస్తుతం ఆమె జీవీఎంసీ ఆరో వార్డు కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. జీవీఎంసీ మేయర్ ఎన్నిక ముందు లక్ష్మీ ప్రియాంక వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. దీంతో అవంతి శ్రీనివాస్ కూడా జనసేనలో చేరడం లాంఛనమే అంటున్నారు విశాఖ వాసులు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారానే రాజకీయ రంగ ప్రవేశం చేసిన అవంతి.. ప్రస్తుతం పవన్ సారధ్యంలోని జనసేనలో చేరనున్నట్లు తేలిపోయింది.




