Friday, September 12, 2025 11:16 PM
Friday, September 12, 2025 11:16 PM
roots

బెట్టింగ్ యాప్స్.. బయటకు వస్తున్న మోసగాళ్ళు..!

దేశ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తీవ్రమైన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ను డబ్బుల కోసం సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులు ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడం వివాదాస్పదం అయింది. ఇటీవల బెట్టింగ్ యాప్స్ బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల వైజాగ్ కు చెందిన లోకల్ బాయ్ నానీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో కూడా పలువురిపై కేసులు నమోదు అయ్యాయి.

Also Read : చంద్రబాబు నిజంగానే మారారా..?

తాజాగా బయ్యా సన్నీ యాదవ్ అనే యుట్యూబర్ తో సహా మొత్తం 15 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసారు. తాజాగా దీనిపై పోలీసు అధికారులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ పై ఓ సిటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 11 మంది యూట్యూబర్స్, ఇంఫ్ల్యూయన్సర్ లపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ వెల్లడించారు. వారి సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేస్తున్నామన్నారు.

Also Read : అసెంబ్లీలో ధూళిపాళ్ళ సంచలన డిమాండ్

ఏ ఏ వీడియోలు పెట్టారు అన్నది చూస్తామని… ముందుగా ఆధారాలను సేకరిస్తామని అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేసారు. బెట్టింగ్ యాప్ ల ద్వారా అధికంగా డబ్బు సంపాదించవచ్చు అంటూ నిరుద్యోగ యువతకు ఆశ చూపుతున్నారని ఇల్లీగల్ గా బెట్టింగ్ యాప్స్ ఎవరూ ప్రమోషన్స్ చేయవద్దని హెచ్చరించారు. ఇమ్రాన్ ఖాన్ అనే యూట్యూబర్ ఎథిక్స్ లేని గలిజ్ వీడియోలు చేస్తున్నాడని.. తన వీడియోల కోసం చిన్నపిల్లలను కూడా వాడుకుంటున్నాడని పేర్కొన్నారు. ఇమ్రాన్ లాంటి వ్యక్తుల పై నిఘా పెంచామన్నారు. యువతను తప్పుదోవ పట్టించే విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్