Friday, September 12, 2025 07:25 PM
Friday, September 12, 2025 07:25 PM
roots

కార్తీక్ ఆర్యన్ తో శ్రీ లీల డేటింగ్ నిజమేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో యంగ్ బ్యూటీ శ్రీ లీల ఒకరు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఇక్కడ అతి తక్కువ సమయంలోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న శ్రీ లీలకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఒక వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Also Read : సింపతీ కార్డుతో కామెడి పీస్ అయిన పోసాని…!

ఈమె బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వినిపించాయి. అంతే కాకుండా ఇటీవల కార్తీక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన ఒక ప్రైవేటు పార్టీలో శ్రీ లీల కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ పార్టీలో ఈమె అందరితో సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇలా కార్తీక్ ఆర్యన్, శ్రీ లీల ప్రేమలో ఉన్నారు అంటూ వస్తున్నటువంటి ఈ రూమర్లపై తాజాగా హీరో కార్తీక్ ఆర్యన్ తల్లి స్పందిస్తూ చేసిన కామెంట్లు ప్రస్తుతం సంచలనగా మారాయి.

Also Read : రాజమౌళి – మహేష్ ప్రాజెక్ట్ పై బాలీవుడ్ మీడియా ఫోకస్

తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐఫా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ మైక్ అందుకుని కార్తీక్ ఆర్యన్ తల్లిని తనకు కాబోయే కోడలు గురించి ప్రశ్నించారు. మీ ఇంటికి ఎలాంటి కోడలు రావాలని కోరుకుంటున్నారు అంటూ ఈయన ప్రశ్నించడంతో వెంటనే కార్తీక్ తల్లి తన ఇంటికి ఒక మంచి వైద్యురాలు అయినటువంటి కోడలు వస్తే బాగుంటుంది అంటూ తడుముకోకుండా సమాధానం చెప్పారు.

Also Read : రెబల్ స్టార్ కి సందీప్ వంగ కండీషన్లు.. వర్క్ అవుట్ అయ్యేనా?..!

ఇలా ఈమె చెప్పిన సమాధానం విని శ్రీ లీల అభిమానులు షాక్ అవుతున్నారు. ఈమె ఖచ్చితంగా శ్రీ లీలను ఉద్దేశించే ఇలాంటి కామెంట్స్ చేశారని భావిస్తున్నారు. శ్రీ లీల ప్రస్తుతం హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ మరోవైపు వైద్య విద్యను అభ్యసిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఒకవైపు మెడిసన్ చదువుతూనే మరోవైపు సినిమాలలో నటిస్తూ శ్రీ లీల బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కార్తీక్ ఆర్యన్ తల్లి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్లు నిజమేనని ఆ అభిమానులు భావిస్తున్నారు. ఇక కార్తీక్ ఆర్యన్ ఇంట్లో కూడా అందరూ డాక్టర్లు కావటం విశేషం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్