ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోయినా.. శాసనమండలిలో మాత్రం వైసిపి ఎమ్మెల్సీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పలు కీలక అంశాలపై ప్రశ్నలను సంధిస్తున్నారు వైసీపీ నేతలు. ఇక దీనికి ఏపీ మంత్రులు కూడా ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు. పలు కీలక శాఖలపై ప్రశ్నలు రావడంతో పక్కా లెక్కలతో మంత్రులు సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : రాజకీయాలకు వంగవీటి గుడ్ బై..!
అయితే ఇక్కడ అధికారుల నుంచి మంత్రులకు సహకారం ఉండటం లేదు అనే ఆరోపణ ప్రధానంగా వినపడుతోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అలాగే చిన్న మధ్య తరహా కంపెనీల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సహా.. కొంతమంది కీలక శాఖల మంత్రులకు అధికారుల నుంచి సహకారం లేదు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానాలు సిద్ధం చేసుకుని అధికారులు రెడీగా ఉండాలి. కానీ కొంతమంది కీలక అధికారులు శాసనమండలిలో ఉండేందుకు ఆసక్తి చూపించడం లేదు.
Also Read : పార్టీ క్యాడర్ ను ముంచుతున్న ఎమ్మెల్యే…?
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా సరే అధికారులు బయటే ఉంటూ వైసీపీకి పరోక్షంగా సహకరిస్తున్నారు అనే ఆరోపణలు కూడా ప్రధానంగా వినపడుతున్నాయి. దీనిపై నారా లోకేష్ బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వం పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు అనే దానిపై లెక్కలు తీసుకోవడానికి తనకు వారం రోజుల పట్టిందని, కొంతమంది అధికారులు సహకరించడం లేదని లోకేష్ అసహనంగా మాట్లాడారు.
Also Read : వాళ్లకు లాస్ట్ వార్నింగ్.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు…!
అటు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా అధికారులు తీరిపై అసహనం వ్యక్తం చేశారు మండలిలో తాను మాట్లాడుతుంటే అధికారులు బయట ఎందుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. దీనికి వివరణ కూడా మంత్రి లిఖితపూర్వకంగా అడిగినట్లు సమాచారం. అటు జలవనరుల శాఖ అధికారులు కూడా మంత్రి నిమ్మల రామానాయుడు కొన్ని విషయాల్లో ఇబ్బందులు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.