Friday, September 12, 2025 08:59 PM
Friday, September 12, 2025 08:59 PM
roots

కూటమి కసరత్తు.. ఎమ్మెల్సీ కుంపటిలో టీడీపీ

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ స్థానాల విషయంలో ఉత్కంట పెరిగిపోతోంది. కూటమి అధిష్టానాలు ఎవరిని ఎంపిక చేస్తాయి అనే దానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పై కూటమి కసరత్తు గట్టిగానే చేస్తోంది. ఇప్పటికే నాగబాబు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన జనసేన.. ఆయన నామినేషన్ వేయాలని సూచించింది. మిగతా నాలుగు స్థానాల కోసం టీడీపీ లో 30 మంది వరకు ఆశావాహులు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో పొత్తులో పోటీ అవకాశం కోల్పోయిన వారిలో ఒకరికి ఇచ్చే అవకాశాలను టీడీపీ పరిశీలిస్తోంది.

Also Read :రాజ్యసభ సీటుపై కూటమి సంచలన నిర్ణయం…?

పిఠాపురం వర్మ కు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా లేదన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మళ్ళీ తమ అభ్యర్దిత్వాలను పరిశీలించాలని ప్రస్తుతం పదవీకాలం పూర్తి చేసుకుంటున్న ఎమ్మెల్సీలు కోరుతున్నారు. ఒక సంవత్సరం పదవీకాలం ముందే రాజీనామా చేసి టీడీపీ కి వచ్చిన తనకు పునరుద్ధరించాలని జంగా కృష్ణ మూర్తి కోరుతున్నారు. ఆయనకు పల్నాడు జిల్లాలో మంచి పట్టు ఉంది. మైనార్టీ కోటా లో ఎమ్మెల్సీ ఆశిస్తున్న నాగుల్ మీరా, మహమ్మద్ నజీర్.. ఇప్పటికే అధిష్టానానికి తమ వాణి వినిపించారు.

Also Read : రేవంత్ బీజేపీలోకి వచ్చెయ్.. ఎంపీ సంచలన కామెంట్స్

అవకాశం కోసం ఎస్సి నేతలు పీతల సుజాత, కే ఎస్ జవహర్ ఎదురు చూస్తున్నారు. బీసీ కోటాలో బుద్దా వెంకన్న, బీదా రవిచంద్ర, తిప్పే స్వామి, బీ టీ నాయుడు, రెడ్డి సుబ్రహ్మణ్యం, మోపిదేవి వెంకట రమణ ప్రయత్నం చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి కొమ్మాలపాటి శ్రీధర్, గన్ని వీరాంజనేయులు, నల్లపాటి రాము పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. బీజేపీ కి ఒక స్థానాన్ని ఇచ్చే అంశంపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఒకవేళ ఇస్తే పోటీలో మహిళా నేత శరణాల మాలతీ రాణి, ఉత్తరాంధ్ర నుంచి మాధవ్ సిద్దంగా ఉన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్