Saturday, September 13, 2025 01:07 AM
Saturday, September 13, 2025 01:07 AM
roots

టీటీడీని ఇబ్బంది పెడుతున్న నో ఫ్లై జోన్..!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. నిత్యం లక్షలాది భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకుంటారు. రోజు రూ.కోట్లల్లో ఆదాయం. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తిరుమల చేరుకుంటారు. రోజుకు 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. పవిత్రమైన తిరుమలలో చిన్న విషయం కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇటీవల తరచూ తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు ఎగురుతున్నాయి. దీనిపై ఇప్పటికే కేంద్రానికి టీటీడీ పాలకమండలి సభ్యులు, అధికారులు పలుమార్లు లేఖలు కూడా రాశారు. అయినా సరే.. తరచూ విమానాలు, హెలికాఫ్టర్‌లు ప్రయాణిస్తూనే ఉన్నాయి. దీంతో ఈ అంశం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది.

Also Read :చంద్రబాబు, లోకేష్ పేషీల చుట్టూ ప్రదక్షణలు

తిరుమల ఆలయ సమీపంలో విమాన శబ్దం వినిపిస్తే చాలు.. కలకలం రేపుతోంది. తాజాగా రెండు విమానాలు ఒకేరోజు తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి ప్రయాణించడం సర్వత్ర చర్చకు దారితీస్తోంది. దీంతో తిరుమల ఆలయం పై నుంచి ఎలాంటి విమానాలు ఎగురకుండా చూడాలంటూ కేంద్ర పౌర విమానయాన శాఖకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. దీనికి కేంద్రం నుంచి జవాబు వచ్చినట్లు తెలుస్తోంది. అసలు ఆలయంపై నుంచి విమానాలు ఎగురకూడదని ఏదైనా చట్టం ఉందా.. అంటూ లేఖ రాసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి తిరుమలలో అన్ని ఆగమశాస్త్రం ప్రకారం నడుచుకుంటాయి. ఆలయంపై విమానాలు ఎగురకూడదని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అయితే అది ఏ శాస్త్రంలో ఉంది అనే విషయం మాత్రం వెల్లడించటం లేదు.

Also Read :ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కవర్ డ్రైవ్..!

వాస్తవానికి ఆగమ శాస్త్రం అనేది పూజా విధానాల నిర్వహణకు సంబంధించిన శాస్త్రం. ఆగమ శాస్త్రాలు రెండు రకాలు. ఒకటి శివాలయాల్లో నిర్వహించే విధానం సూచిస్తుంటే.. మరోకటి వైష్ణవాలయంలో పూజా విధానాలు సూచిస్తుంది. ఇందులో కూడా వైఖానస, పాంచరాత్రగమం అనే రెండు విధానాలున్నాయి. ప్రస్తుతం తిరుమలలో వైఖానస ఆగమనం విధానాన్ని అనుసరిస్తున్నారు. తిరుపతిలోని అలివేలు మంగాపురం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మాత్రం పాంచరాత్రగమం విధానం అనుసరిస్తారు. చిన్నజీయరు స్వామి వారి పాంచరాత్ర ఆగమ విధానానికి చెందిన వారు. ఇవి కాకుండా ఆలయ నిర్మాణాన్ని ఎలా చేపట్టాలో వివరించేందుకు వాస్తు ఆగమం ఉంది. వాస్తవానికి ఆలయంపైన విమానాలు ఎగురకూడదని చట్టంలో ఎక్కడా లేదు. ఆగమ శాస్త్రంలో ఉందని టీటీడీ అదికారులు చెబుతున్నారు.

Also Read : సీఎం పర్యటన… ఆ ప్రాంత వాసుల కల నెరవేరేనా..?

దీనికి గయోపాఖ్యానం ఉదాహరిస్తున్నారు. పుష్పక విమానంలో వెళ్తున్న గయుడు.. తాంబూలం కిందకి ఉమ్మి వేసినప్పుడు… అది నేరుగా శ్రీకృష్ణుడు చేతిలో పడుతుంది. ఇది పౌరాణిక గాథ. ఇలా ఎవరైనా సరే పై నుంచి చేస్తే… ఆలయం అపవిత్రం అవుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. పుష్పక విమానం అనేది ఊహ. ఆధునిక విమానాల్లో కనీసం బయటకు తొంగి చూసే పరిస్థితి కూడా లేదు. ఇక మరో విషయాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. ఆలయంపై నుంచి పక్షులు ఎగురకుండా నిషేధించడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. తిరుమల ఆలయంపై నుంచి నిషేధం విధిస్తే… మరి మిగిలిన ఆలయాల పరిస్థితి ఏమిటని కూడా విమానయాన శాఖ అధికారులు లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దేశంలో ఎన్నో ఆలయాలపై నుంచి విమానాలు ప్రయాణం చేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎయిర్ ట్రాఫిక్ పెరిగిపోయిన నేపథ్యంలో… విమానాల దారి మళ్లింపు అంశం సాంకేతికపరమైనదని లేఖలో ప్రస్తావించారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కూడా లేఖలో వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్