ఏది ఏమైనా 2023 వరల్డ్ కప్ తర్వాత టీమ్ ఇండియా ఆస్ట్రేలియా కు భయపడుతుంది అనే అభిప్రాయం జనాల్లో బలబడిపోయింది. 2023 లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడిపోయింది. గత ఏడాది జరిగిన టి20 ప్రపంచకప్ సెమి ఫైనల్లో దాదాపుగా ఓడిపోతుంది.. అనుకున్న మ్యాచ్ లో భారత్ అద్భుత ప్రదర్శన చేసి ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఇక గత ఏడాది జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ లో విజయం సాధించినా.. ఆ తర్వాత మాత్రం చతికిలపడింది భారత జట్టు.
Also Read : ఆయుధం ఉన్నా వాడని టీం ఇండియా…!
ఇక ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే.. లీగ్ మ్యాచ్ లలో భారత్ తిరుగులేని విజయాలను నమోదు చేసింది. లో స్కోరింగ్ మ్యాచ్ అయినా సరే.. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో స్పిన్ బౌలర్లు రాణించడంతో భారత్ సత్తా చాటింది. అయితే ఇప్పుడు సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా తో భారత తలపడనున్న నేపథ్యంలో.. అభిమానుల్లో భయాలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియానను దాటి ఫైనల్ కు చేరుతుందా అనేదానిపై ఆసక్తి పెరిగిపోయింది. అయితే ఆ జట్టు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరం కావడం భారత జట్టుకు కలిసి వచ్చే అంశం అని కొంతమంది అంటున్నారు.
Also Read : మెగా ఫాన్స్ కు రాంచరణ్ టెన్షన్
అసలు ఆస్ట్రేలియాకు భయపడాల్సిన అవసరం ఏంటని.. ఓడినా.. గెలిచినా.. ఆస్ట్రేలియా కూడా ఒక క్రికెట్ టీం మాత్రమే అని మరికొంతమంది అభిమానులు అంటున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం పక్క వ్యూహంతో ఆస్ట్రేలియాపై బరిలోకి దిగాలని.. లెఫ్ట్ హ్యాండ్ పేస్ బౌలర్ టీం లో ఉంటే మంచిదని కామెంట్ చేస్తున్నారు. దుబాయ్ మైదానం భారత్ కు అనుకూలంగా ఉంది. ఇక స్పిన్ బౌలింగ్ విభాగం కూడా బలంగానే కనపడుతుంది. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ లో భారత విజయం సాధించడం పెద్ద విషయం కాదని.. అనవసరంగా ఆస్ట్రేలియాకు ఎలివేషన్ ఇవ్వద్దు అంటూ క్రికెట్ అనలిస్ట్ లు అంటున్నారు.