Monday, October 27, 2025 10:34 PM
Monday, October 27, 2025 10:34 PM
roots

బయటపడుతున్న వంశీ పాపాలు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పాపాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. నియోజకవర్గంలో ఆయన చేసిన దందాలు, కబ్జాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. దీనిపై ఇప్పటికే నలుగురు సభ్యులతో కూడిన సిట్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో దాదాపు 195 కోట్ల మేర వంశీ కారణంగా నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం వద్దకు ఆధారాలు కూడా అందినట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read : ఇలా అయితే కష్టమే అంటున్న తమ్ముళ్లు..!

ఇక తాజాగా వంశీ పాపాలను బయటకు లాగుతున్నారు అధికారులు. వల్లభనేని వంశీ పై భూ కబ్జా కేసు నమోదు అయింది. గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు చేసారు పోలీసులు. గన్నవరంలో గాంధీ బొమ్మ సెంటర్ లో 10 కోట్లు విలువైన స్థలం కబ్జాపై కేసు పోలీసులు కేసు నమోదు చేసారు. హైకోర్ట్ న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్టు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసారు. వ్యవస్థీకృత నేరం క్రింద కేసు నమోదు చేయాలి అని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసారు.

Also Read : మంచం కింద దూరాడు.. ఇప్పుడేమంటారు..?

వల్లభనేని వంశీ తో పాటు మరో 15 మందిపై హైకోర్ట్ న్యాయవాది సతీమణి సీతా మహాలక్ష్మి ఫిర్యాదు చేసారు. ఆ రోజు స్థలం కబ్జా పై ఫిర్యాదు చేసినా అప్పుడు పోలీసులు పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక వంశీకి కోర్ట్ రిమాండ్ పొడిగించింది. విజయవాడ సబ్ జైల్లో న్యాయమూర్తి ఎదుట వర్చువల్ గా పోలీసులు హాజరు పరిచారు. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. వంశీతో పాటు కిడ్నాప్ కేసులో ఉన్న నలుగురు నిందితులకు కూడా రిమాండ్ పొడిగించారు. మార్చి 11 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగించారు న్యాయమూర్తి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్