రాజమౌళి సినిమా విషయంలో మీడియా హడావుడి ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే జనాలు గట్టిగానే ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇక లేటెస్ట్ గా మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ లు బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా షూటింగ్ స్పాట్ లో రాజమౌళి పెట్టిన కండిషన్స్ గురించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. సినిమా విషయంలో మూవీ యూనిట్ కు అలాగే టెక్నీషియన్స్ కు రాజమౌళి గట్టిగానే వార్నింగ్ లు ఇచ్చినట్లు సమాచారం.
Also Read : బాబీతో సినిమా చేస్తే పద్మ గ్యారెంటీ..?
నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ ను సినిమా యూనిట్ తో రాజమౌళి చేయించినట్లు సమాచారం. దీని ప్రకారం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి విషయాన్ని కూడా బయట పెట్టడానికి వీల్లేదు. పెడితే మాత్రం కచ్చితంగా భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. దర్శక, నిర్మాతల అనుమతులు లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేసినా, బయటకు చెప్పినా సరే భారీ ఫైన్ విధిస్తారు. మరోవైపు హీరోతో సహా సెట్లో ఉన్న ఎవరైనా సరే ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదు. అల్యూమినియం ఫ్యాక్టరీలో రెడీ చేసిన సెట్ లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read : సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబు సంచలన కామెంట్స్
మరో రెండు మూడు చోట్ల కూడా ప్రత్యేకంగా సెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. పాన్ వరల్డ్ లో తీస్తున్న సినిమా కావడంతో ఎక్కడా కూడా లీకులు బయటకు రాకూడదని రాజమౌళి జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను ఫైనల్ చేశాడు జక్కన్న. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో జరిగే షూట్ లో పాల్గొంటుంది. త్వరలోనే ఈ సినిమా షూట్ ఆఫ్రికాలో కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటించబోతున్నట్లు సమాచారం.