Saturday, September 13, 2025 01:12 AM
Saturday, September 13, 2025 01:12 AM
roots

ఉత్తరాంధ్ర నేతలు ఏమయ్యారు..?

ఉత్తరాంధ్ర… మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు… 5 పార్లమెంట్ నియోజకవర్గాలు… ప్రస్తుతం 3 జిల్లా పరిషత్ స్థానాలు… నిన్నటి వరకు చక్రం తిప్పిన నేతలంతా ఇప్పుడు కనీసం కనిపించటం లేదు. ఉత్తరాంధ్ర వైసీపీలో కీలక నేతలంతా ఒక్కసారిగా పార్టీకి దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. మిగిలిన 28 కూడా వైసీపీ ఖాతాలోనే చేరిపోయాయి. అలాగే శ్రీకాకుళం పార్లమెంట్ మినహా… మిగిలిన 4 పార్లమెంట్ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. 2024 ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ కేవలం ఉమ్మడి విశాఖ జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అరకు పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకుంది.

Also Read : ఉద్యోగాల జాతర.. ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా మాయమైపోయారు. ఇంకా చెప్పాలంటే.. మాజీలంతా కనీసం పార్టీతో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసినా సరే.. అటు వైపు కన్నెత్తికూడా చూడటంలేదు. కొందరు నేతలైతే ఇటీవల అధినేత జగన్ ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా డుమ్మా కొట్టేశారు. సంక్రాంతి నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తానని ఇప్పటికే జగన్ ప్రకటించారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు రోజుల పాటు పార్టీ సమావేశాలు, నియోజకవర్గాల సమీక్ష, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తానని ఇప్పటికే ప్రకటించారు. అలాగే బహిరంగ సభలు కూడా నిర్వహించే అవకాశం ఉందంటున్నారు పార్టీ పెద్దలు. అయితే ఈ సభలకు జన సమీకరణ ఇప్పుడు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందనేది పార్టీ నేతల మాట. జన సమీకరణలో విఫలమైతే ఇంఛార్జులను జగన్ మారుస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

Also Read : టీడీపీలో సీనియర్లకు గుర్తింపు ఏదీ..?

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఇటీవల వైసీపీ తరఫున ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది దూరంగా ఉన్నారు. కొందరైతే… తమ వ్యాపారాల్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. పార్టీ పిలుపు మేరకు ఆందోళనలు చేయాలంటే ముందుగా తెగింపు ఉండాలి. అయితే ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో చాలామంది నేతలపై ప్రభుత్వం కేసులు పెట్టింది. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఇలా ఒకరేమిటి… చాలామంది నేతలపై ఆరోపణలు ఉన్నాయి. గుడివాడ అమర్నాథ్ మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు. పార్టీలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పూర్తిగా బెంగళూరుకు పరిమితమయ్యారు. ఇక పాడేరు, అరకులో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. అధికారులు మాత్రం కూటమి నేతల మాటే వింటున్నారు. దీంతో ఆ ఇద్దరు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. ఉత్తరాంధ్రపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జగన్‌కు వైసీపీ నేతలు గట్టి షాక్ ఇచ్చినట్లే అవుతుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్