Friday, September 12, 2025 10:00 PM
Friday, September 12, 2025 10:00 PM
roots

వంశీకి వైసీపీ మద్దతు ఎక్కడ..? రజనీ కోసం రంగంలోకి పార్టీ అధిష్టానం..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే కనపడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎగిరెగిరి పడిన వల్లభనేని వంశీ ఇప్పుడు మాత్రం కాస్త గట్టిగానే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఆరోగ్య సమస్యలు వంశీని మరింత ఇబ్బంది పెడుతున్నాయి. పలు కేసుల్లో అరెస్టు అయిన వంశీ ఇటీవల ఓ కేసులో బెయిల్ తెచ్చుకున్నారు. ఇక కొన్ని అక్రమాలకు సంబంధించి పోలీసులు మరికొన్ని కేసులను బయటకు తీస్తున్నారు.

Also read : ముఖ్య‌మంత్రి పీ4 ఆద‌ర్శంగా.. గొట్టిపాటి అడుగులు..!

సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ తెచ్చుకున్న తర్వాత నూజివీడు కోర్టు పిటి వారెంట్ కు అనుమతి ఇచ్చింది. దీనితో వంశీ మరిన్ని రోజులు జైల్లోనే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక వల్లభనేని వంశీ వీడియోలు చూస్తున్న ఆ పార్టీలోనీ కొంతమంది గన్నవరం నియోజకవర్గ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ మధ్య చలాకీగా హుషారుగా తిరిగిన వంశీ ఇలా అయిపోయారు ఏంటి అంటూ బాధపడిపోతున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. ఇక వంశి ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య పంకజ శ్రీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also read : కేసీఆర్ చేస్తే రైట్.. మరి రేవంత్ చేస్తే..!

ఇటీవల విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు పలు పరీక్షలు కూడా నిర్వహించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది గాని.. వంశి ఆరోగ్యం గురించి వైసిపి అధిష్టానం ఏమాత్రం ఆరా తీయడం లేదు అనేది కాస్త గట్టిగా వినపడుతోంది. ఆయనను వెనక ఉండి ప్రోత్సహించిన కృష్ణా జిల్లా నాయకులు కూడా ఇప్పుడు ఆయనను చూసేందుకు కనీసం జైలుకు కూడా వెళ్లడం లేదు. వంశి ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో కూడా కథనాలు వస్తున్నా సరే కనీసం వంశీకి మద్దతుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి రెండు మాటలు కూడా మాట్లాడే సాహసం ఆ పార్టీ నాయకత్వం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Also read : టీడీపీ రూట్ మ్యాప్.. మహానాడులో అన్నీ సంచలనాలే

ఇది ఒకటైతే.. మాజీ మంత్రి విడుదల రజినినీ పోలీసులు ఇబ్బంది పెట్టారని వైసీపీ నేతలు వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడేస్తున్నారు. ఆ పార్టీ కీలక నేతలు రజినినీ పరామర్శించారు కూడా. వాస్తవానికి అరెస్టు చేసింది రజినీని కాదు. ఆమె పర్సనల్ అసిస్టెంట్ శ్రీకాంత్ రెడ్డిని. దానికి సంబంధించి వైసీపీ కీలక నాయకులు పదేపదే రజినీతో మాట్లాడటం.. ఆమెకు అండగా నిలబడుతూ ప్రెస్ మీట్ లు పెట్టడం.. విస్మయం కలిగిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న వంశీని కనీసం కృష్ణా జిల్లా నాయకులు కూడా పరామర్శించకుండా.. గుంటూరు జిల్లాకు చెందిన రజనీపై మద్దతుగా వ్యాఖ్యలు చేయడం చూసి వైసిపి వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్