Wednesday, September 10, 2025 01:13 AM
Wednesday, September 10, 2025 01:13 AM
roots

అవును.. వాళ్లు మాత్రమే వస్తారు..!

వైసీపీలో చీలిక వచ్చిందనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి వైసీపీలో చీలిక వచ్చిందా అనే ప్రశ్నకు ఎన్నికల ముందే షర్మిల కొత్త పార్టీతో అవుననే జవాబు వచ్చింది. అన్నతో విబేధించిన షర్మిల.. వైఎస్ఆర్‌టీపీ అంటూ కొత్త పార్టీ పెట్టినప్పుడే వైసీపీ పతనం మొదలైంది. ఆ తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు షర్మిల. ఇక ఎన్నికల్లో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 11 స్థానాలు మాత్రమే రావడంతో.. సభకు వచ్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖం చెల్లడం లేదు.

ఈ నెల 18వ తేదీ నుంచి ఏపీ శాసన సభ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. వీటికి వైసీపీ సభ్యులు హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఈ సమావేశాలు 7 నుంచి పది పనిదినాల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లోనే ఆరు ఆర్డినెన్స్‌ల స్థానంలో వాటికి సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే కొన్ని కొత్త బిల్లులను కూడా అసెంబ్లీ చర్చించి ఆమోదించే అవకాశం కనిపిస్తోంది.

అయితే ఈ సమావేశాలకు వైసీపీ సభ్యుల హాజరు సర్వాత్రా ఉత్కంఠంగా మారింది. ప్రతిపక్ష హోదా ఇస్తే.. జగన్ సభకు వచ్చి తన గళం విప్పుతారని ఇప్పటికే వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అంటే జగన్ సభకు వచ్చే అవకాశం లేదు. ఇక సభకు 60 పని దినాలు హాజరు కాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందని ఇప్పటికే స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు కూడా. అలాగే గతంలో సభకు హాజరుకాకుండా.. రిజిస్టర్‌లో సంతకం పెట్టి బయట నుంచే వెళ్లిపోవడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకునేది లేదన్నారు. సభలో కూర్చుంటేనే లెక్కిస్తామన్నారు.

దీంతో వైసీపీ తరఫున కొత్తగా ఎన్నికైన సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వైసీపీ తరఫున పోటీ చేసిన వారిలో 11 మంది మాత్రమే ఎన్నికయ్యారు. వారిలో పెద్దిరెడ్డి సోదరులు, జగన్ మోహన్ రెడ్డి, మాత్రమే సీనియర్లు. మిగిలిన వారంతా జూనియర్లే. రాజంపేట, బద్వేలు, మంత్రాలయం, దర్శి, ఆలేరు ఎమ్మెల్యేలు రెండోసారి ఎన్నికవ్వగా.. యర్రగొండపాలెం, పాడేరు, అరకు శాసనసభ్యులు మొదటి సారి గెలిచారు. వీళ్లు సభకు రావాలని భావిస్తున్నారు. కానీ అధినేత మాటకు కట్టుబడి బయటే ఉంటున్నారు.

అనర్హత వేటు హెచ్చరికల నేపథ్యంలో సభకు హాజరవ్వాలని వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అందరూ కాకుండా.. అరకు, పాడేరు, యర్రగొండపాలెం, దర్శి, ఆలేరు, మంత్రాలయం ఎమ్మెల్యేలు సభకు వెళ్లాలన భావిస్తున్నట్లు సమాచారం. అయితే సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. అలా చేస్తే.. అనర్హత వేటు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.. అలాగే తమ నియోజకవర్గాల్లో పరువు కూడా దక్కుతుందనేది ఎమ్మెల్యేల భావన. మరి హాజరవుతారా.. లేదా అనేది తెలియాలంటే.. మరో పది రోజులు ఆగాల్సిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఈవీఎంలా..? బ్యాలెట్టా..? చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో...

ఓజీ కోసం.. చీఫ్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా...

దుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు..!

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి...

జగన్‌కు షాక్.. వైసీపీలో...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస...

మాకు ఈ పదవులు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర...

గ్లాస్ స్కై వాక్...

ఏదైనా మంచి జరిగితే.. అది మా...

పోల్స్