ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం విషయంలో చాలా తక్కువ అంచనా వేసిన వైసీపీ నేతలకు ఇప్పుడు సినిమా కనపడుతోంది. లిక్కర్ స్కాం విషయంలో ముందు నుంచి ధీమాగా ఉన్న అధిష్టానం.. ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో భయపడుతోందా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. లిక్కర్ స్కాం విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో ఇప్పుడే వైసీపీకి క్లారిటీ వచ్చింది. ఇక జగన్ ఎంతో ధైర్యం కల్పించి.. వైసీపీ క్యాడర్ కు, నాయకులకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : మరో మాజీ మంత్రికి లిక్కర్ దెబ్బ
ఇలాంటి సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు వైసీపీ నాయకత్వం ఊహించలేదు. ఇన్నాళ్ళుగా అజ్ఞాతంలో ఉన్న కొడాలి నానీ, తోపదుర్తి ప్రకాష్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడటం ఖాయం అని వైసీపీ క్యాడర్ భావించింది. జగన్ కూడా వారికి ధైర్యం కల్పించే విధంగానే ప్రసంగాలు చేసారు. కొందరు నాయకులతో ఆయన స్వయంగా ఫోన్ లో కూడా మాట్లాడటం వంటివి జరిగాయి. పలు పర్యటనలు కూడా చేసారు జగన్.
Also Read : బన్నీ టార్గెట్ వేరే లెవెల్.. మరీ ఈ రేంజ్ లోనా..?
ఆ తర్వాతనే ఆర్కే రోజా, పేర్ని నానీ వంటి వారి స్వరంలో మార్పు వచ్చింది. భయపడిన వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. కాని ఇప్పుడు జగన్ తర్వాత అగ్ర నేతగా భావించే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం వైసీపీ అసలు ఊహించలేదు. ఆయననే జగన్ కాపాడుకోలేకపోయారు. దీనితో తమ పరిస్థితి ఏంటీ అనే భయం వైసీపీ నాయకత్వంలో మొదలైంది. వల్లభనేని వంశీని ప్రభుత్వమే వదిలేసింది అనే అనుమానాలు కూడా వైసీపీ వర్గాలు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉంటాయి. అరెస్ట్ అయిన ఏ ఒక్కరిని అధిష్టానం కాపాడే ప్రయత్నం చేయలేదు. మిథున్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేసినా అరెస్ట్ మాత్రం ఆగలేదు. మరి వైసీపీ నేతలు బయటకు వస్తారా..? సైలెంట్ గా ఉంటారా చూడాలి.