Friday, September 12, 2025 07:36 PM
Friday, September 12, 2025 07:36 PM
roots

ఇక ఆ పేరు మారదా..? 9 నెలలు చాల్లేదు..!

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎక్కడ పడితే అక్కడ పేర్లు మారుస్తూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు లేదంటే వైయస్ జగన్ పేరు పెట్టుకునే పరిస్థితి ఉండేది. ఇక రాజశేఖర్ రెడ్డి కి సంబంధం లేని ప్రాంతాల్లో ఆయన చేయని పనులకు కూడా ఆయన పేరు పెట్టిన పరిస్థితి ఉంది. అప్పట్లో విజయవాడలో ఎన్టీఆర్ యూనివర్సిటీకి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం చూసి చాలామంది షాక్ అయ్యారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Also Read : వైసీపీ నేతల్లో ఆ భయం.. కూటమికి బలం..!

ఈ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా వైసిపి పై పడింది అని ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పటికీ కామెంట్ చేస్తూ ఉంటారు. ఇక టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అలా పేర్లు మార్చిన వాటిని.. తిరిగి మళ్లీ యధా స్థానానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇలా హామీ ఇచ్చిన వాటిలో విజయవాడ రూరల్ తాడిగడప మున్సిపాలిటీ కూడా ఒకటి. జగన్ హయాంలో తాడిగడపకు వైఎస్ఆర్ పేరు పెట్టారు. అధికారంలోకి రాగానే మారుస్తామని అప్పట్లో టిడిపి హామీ ఇచ్చింది.

Also Read : సింపతీ కార్డుతో కామెడి పీస్ అయిన పోసాని…!

టిడిపి అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినా సరే… ఇప్పటివరకు పేరు మార్చలేదు. పేరు మార్పులకు వీలుగా చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో పెట్టడానికి కూటమి ప్రభుత్వానికి కుదరలేదు. జగన్ మెప్పు పొందేందుకు అప్పట్లో ఒక కీలక ప్రజా ప్రతినిధి.. తాడిగడప మున్సిపాలిటీకి వైయస్సార్ పేరు పెట్టించారు. తాడిగడప, యనమలకుదురు, పోరంకి, కానూరు గ్రామపంచాయతీలను కలుపుతూ ఈ మున్సిపాలిటీని అప్పట్లో ఏర్పాటు చేశారు.

Also Read : మౌనమే.. విజయసాయి రెడ్డిపై సైలెంట్ గా వైసీపీ

దీని కోసం ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చి తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించారు. తాడిగడప ప్రాంతంలో ఏ విధంగా కూడా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎటువంటి సంబంధం లేని రాజశేఖర్ రెడ్డి పేరును పెట్టడాన్ని అప్పట్లో అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని గమనించిన టిడిపి ఆ పేరు మారుస్తామని ఎన్నోసార్లు హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు పేరు మాత్రం మారలేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్